ఇక కన్ఫర్మ్ అయినట్లే

బోయపాటి డైరెక్షన్ లో 'జయ జానకి నాయక' చిత్రం గత శుక్రవారమే విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. క్రిటిక్స్ కూడా 'జయ జానకి నాయక'కి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చేసారు. బోయపాటి మార్క్ స్టయిల్ తో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ లు జంటగా నటించారు. ఇక ఈ చిత్రంలో అందాల ఆరబోతతో ప్రగ్యా జైస్వాల్ అందరిని హాట్ హాట్ గా ఆకట్టుకుంది. అలాగే ఐటెం సాంగ్ సుందరి కేథరిన్ కూడా గ్లామర్ షోలో రెచ్చిపోయింది.
ఇక ఈ చిత్రంలో బోయపాటి మార్క్ డైలాగ్స్ కి థియేటర్స్ లో ప్రేక్షకులు విజిల్స్ తో సమాధానం చెబుతున్నారు. సినిమా చూసిన టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా బోయపాటిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బోయపాటి యాక్షన్ మార్క్ ప్రేమకథను సూపర్ గా ప్రెజెంట్ చేసాడని అందరూ బోయపాటిని ప్రశంసిస్తున్నారు. అయితే టాలీవుడ్ లో ఎవరు బోయపాటిని ప్రశంసించినా గాని ఇప్పుడు ఒకరి ప్రశంస మాత్రం బాగా హైలెట్ అయ్యింది. అది మరెవరో కాదు బోయపాటి డైరెక్షన్ లో ఆయన సినిమా రాబోతుందంటూ ఎప్పటినుండో వార్తల్లో నానుతున్న మెగా స్టార్ చిరంజీవి.
మెగాస్టార్ చిరు, బోయపాటికి ఫోన్ చేసి మరీ 'జయ జానకి నాయక' సినిమా విజయానికి అభినందలు తెలిపారట. సినిమా పాజిటివ్ టాక్ పై చిరంజీవి, బోయపాటిని ప్రశంసించి అభినందనలు తెలిపినట్టుగా చెబుతున్నారు. మరి మెగాస్టార్ నుండి బోయపాటికి ఫోన్ వచ్చిందిఅంటే..... ఎప్పటినుండో వీరి కాబినేషన్ లో సినిమా ఉందంటూ వస్తున్న వార్తలకు బలం చేకూర్చినట్టే అంటున్నారు. మరి మెగాస్టార్ ఉయ్యాలవాడ చిత్రం పూర్తికాగానే బోయపాటి డైరెక్షన్ లో చిరంజీవి తన 152 వ సినిమా చేస్తాడని మాత్రం తెలుస్తుంది. ఇకపోతే బోయపాటి - చిరు ల చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తారని చెబుతున్నారు.

