ఇక అయినట్టే!!

పవన్ కళ్యాణ్ సినిమాలు ఒకపక్క, రాజకీయాలు మరో పక్క అంటూ రెండు పడవల మీద సవారి చేస్తున్నాడు. అందులోను ఈ అక్టోబర్ నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తున్నానంటూ మీడియా ముఖంగా ప్రకటన కూడా చేసాడు. మరి నిజంగా పవన్ గనక అక్టోబర్ లో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంటర్ అయితే గనక ఇప్పుడు లైన్లో పెట్టిన సినిమాల పరిస్తితేంటంటూ పవన్ ఫ్యాన్స్ కి భయం పట్టుకుంది. ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కతున్న చిత్రం షూటింగ్ సగం కంప్లీట్ చేసుకుంది. ఇదొక్కటే కాకుండా పవన్ కళ్యాణ్ మరో రెండు మూడు సినిమాలకు కమిట్ అయ్యాడనే టాక్ ఉండనే ఉంది.
ఇక త్రివిక్రంతో చేస్తున్న సినిమా ప్రస్తుతానికి షూటింగ్ సగం కంప్లీట్ చేసుకున్నప్పటికీ... ప్రస్తుతానికి షూటింగ్ మాత్రం చాలా స్లోగా సాగుతుందట. షూటింగ్ డే మధ్యలో స్టార్ట్ అయినప్పటికీ సాయంత్రం 6 గంటలకల్లా షూటింగ్ కి పేకప్ చెప్పేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారనే టాక్ వినబడుతుంది. అందుకే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదల కావడానికి వచ్చే సంక్రాతి వరకు పడుతుందంటున్నారు. ఇక సినిమా షూటింగ్ కి ఎక్కువ శాతం గ్రీన్ మేటే వాడుతున్నారట. నేచురల్ గా తియ్యాల్సిన సీన్స్ ని పవన్ కి ఇష్టమైనట్టు గ్రీన్ మ్యాట్ సీన్లుగా మారుస్తున్నారనే టాక్ కూడా వినబడుతుంది. కనకనే సినిమా షూటింగ్ లేట్ అవడంతోపాటే బడ్జెట్ ఎక్కుతుందని చెబుతున్నారు.
మరీ ఈ సినిమానే లెక్కకు మించి ఆలస్యం అవుతుంటే పవన్ మిగతా సినిమాల పరిస్థితి ఏమిటనే డౌట్ క్రియేట్ అవుతుంది అందరిలో... ఇక మైత్రి మూవీస్ దగ్గర భారీ పారితోషికం తీసుకుని... వారికి సంతోష్ శ్రీనివాస్ ను డైరక్టర్ గా అప్పగించింది కూడా పవనే. అయితే సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమాని ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పుడు ఫినిష్ చేస్తాడో కూడా పవన్ కి ఒక క్లారిటీ లేదు.

