ఇక్కడ లాభాలే లాభాలు... మరి అక్కడ

తెలుగులో నాని - నివేత థామస్ జంటగా వచ్చిన 'నిన్ను కోరి' సినిమా చిత్రం సూపర్ హిట్ అయ్యింది. క్లాస్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ కొల్లగొట్టి బంపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్ లో రీమేక్ కాబోతుంది. ఈ సినిమాని బాలీవుడ్ లో డబ్ చెయ్యకుండా రీమేక్ చెయ్యాలనే యోచనలో ఉన్నారట. అయితే నిర్మాత డివివి దానయ్యతో కలిసి నిన్ను కోరి కి మాటల రచయిత కోన వెంకట్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వున్న విషయం తెలిసిందే.
అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్ టాప్ దర్శకుడైన సంజయ్ లీలా భన్సాలీ షో వేయించుకుని మరీ చూశారట. అయితే ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు కూడా స్టార్ట్ అయ్యాయట. అయితే బాలీవుడ్ లో గనక రీమేక్ చేస్తే అక్కడ ఆ సినిమా నిర్మాణంలో డివివి దానయ్య, కోన వెంకట్ భాగస్వాములవుతామని చెప్పారట. దీనికి సంజయ్ లీల బన్సాలి కూడా పాజిటివ్ గా స్పందించినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ రీమేక్ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తే బావుంటుందని సంజయ్ లీల కోన కి, దానయ్యకి చెప్పినట్లుగా తెలుస్తుంది.
ఇక ఈ 'నిన్ను కోరి' చిత్రాన్ని వరుణ్ ధవాన్ చూడాలి... దాన్ని ఒకే చెయ్యాలి.. అప్పుడే ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్ లో పట్టాలెక్కే ఛాన్స్ ఉందంటున్నారు. మరి తెలుగులో నిర్మాతలైన దానయ్య, కోన వెంకట్ లు 'నిన్నుకోరి'తో బాగానే వెనకేసుకున్న... వీరు హిందీలో కూడా ఏమేర లాభాలు గడిస్తారో చూద్దాం.

