ఇక్కడ కుదరలేదు... అక్కడ రెడీ అయిపొయింది!!

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున కెరీర్ నే మలుపుతిప్పిన ‘హలో బ్రదర్’ చిత్రాన్ని నాగ్ చైతన్య హీరోగా సీక్వెల్ చేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ అది పట్టాలెక్కలేదు. 'హలొ బ్రదర్' తెలుగులో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ చిత్రాన్ని సల్మాన్ హీరోగా డేవిడ్ ధావన్ బాలీవుడ్ లో ‘జుడ్వా’ పేరుతొ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ ‘జుడ్వా’ పేరుతో రీమేక్ అయిన 'హలో బ్రదర్ ' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
అయితే బాలీవుడ్ లో ‘జుడ్వా’ పేరుతో రీమేక్ అయ్యి హిట్ అయిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తుంది. అయితే ఈ సీక్వెల్ ని కూడా డైరెక్టర్ డేవిడ్ ధావనే తెరకెక్కిస్తున్నాడు. డైరెక్టర్ డేవిడ్ ధావన్ తనయుడు వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న ‘జుడ్వా-2’ చిత్రంలో వరుణ్ ధావన్ సరసన శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తాప్సి లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. ‘జుడ్వా' చిత్రంలాగే ‘జుడ్వా-2’ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఇక ‘జుడ్వా-2’ చిత్రం సెప్టెంబర్ 29 న దసరా కానుకగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతుంది.

