ఇంకా తాను అవుట్ డేటెడ్ అయిపోలేదని నిరూపించుకుంటుంది

2001 లో ఉషాకిరణ్ మూవీస్ వారి ఇష్టం చిత్రంతో వెండితెరకి పరిచయమైన అందాల భామ శ్రియ శరన్ దాదాపు తెలుగులో అగ్ర కథానాయకులందరితో ఆడిపాడింది. ఒక దశాబ్ద కాలం పాటు గ్లామరస్ హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో చక్రం తిప్పిన ఈ భామ ఈ మధ్య కాలంలో కుర్ర కథానాయికల పోటీ మధ్య తాళలేక అడపా దడపా వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకుంటూ సప్పగా సాగుతున్న కెరీర్ కి మరో టర్నింగ్ పాయింట్ కోసం ఎదురు చూస్తుంది. సీనియర్ హీరోస్ నాగార్జునతో మనం, బాలకృష్ణ తో గౌతమీపుత్ర శాతకర్ణి వంటి విజయవంతమైన చిత్రాలు ఖాతాలో వేసుకున్న శ్రీయ ప్రస్తుతం మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కీలక పాత్రలు పోషిస్తున్న గాయత్రి లో కథానాయికగా నటిస్తుంది.
కాగా మధ్య వయసుకి చేరిన కథానాయిక కావటంతో వరుసగా హోమ్లీ పాత్రలే వస్తుండటంతో గ్లామర్ డోస్ కి తానింకా అవుట్ డేటెడ్ హీరోయిన్ కాలేదని నిరూపించటానికి తన లేటెస్ట్ మోడరన్ ఫోటోషూట్స్ తో చెలరేగిపోతుంది. తన నటిస్తున్న గాయత్రి చిత్రం ఫిబ్రవరి నెలలో విడుదల అయ్యే సమయానికి మోడరన్ రోల్స్ మళ్లీ అందిపుచ్చుకోవాలనే తపనతో పని చేస్తునట్టు కనిపిస్తుంది శ్రీయ శరన్.


