ఆ హీరోయిన్ కాస్ట్లీ మెయింటినెన్స్ ?

నటీనటులు రీల్ లైఫ్ లో చాల సింపుల్ గానే కనబడతారు. వారు ఎక్కువగా అలాంటి పాత్రలే చేస్తారు కూడా. అలాంటి వాళ్ళు రియల్ లైఫ్ లో మాత్రం తెగ రిచ్ నెస్ చూపిస్తారు. అలాంటి నటీనటులు సినిమా ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. ఆ నటీనటుల్లో హీరోల కన్నా... హీరోయిన్స్ ఎక్కువగా ఉంటారు. ఆ హీరోయిన్స్ లో మొదట ఉండేది మాత్రం నేనే రాజు నేనే మంత్రి, సరైనోడు సినిమాల్తో లైమ్ లైట్ లో కొచ్చిన క్యాథరిన్ ఉంటుందట. ఈ భామ డబ్బుని మంచి నీళ్ల మాదిరిగా ఖర్చుపెట్టేస్తుందట. సినిమాల్లో ఎలాగున్నా.. బయట మాత్రం చాల రిచ్ మెయింటినెన్స్ అంట.
ఈ విషయాలన్నీ క్యాథరిన్ స్నేహితుల ద్వారా బయటికొచ్చాయి. క్యాథరిన్ స్నేహితురాలు చెప్పిన దాన్ని బట్టి క్యాథరిన్ డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టేస్తుందట. ఈ మధ్యన క్యాథరిన్ హైదరాబాద్ లో ఒక ఇల్లు కొనుకుందట. ఇల్లుకొంటే ఖర్చే కానీ... ఆ ఇంటి ఇంటేరియర్ కోసం క్యాథరిన్ పెట్టిన ఖర్చు చూస్తే అందరు నోరు తెరవాల్సిందేనట. ఆమె ఆ ఇంటి ఇంటేరియర్ కోసం పెట్టిన డబ్బు తో హైదరాబాద్ లో ఒక పెద్ద బంగాళా కట్టేసేంత అంట. మరి క్యాథరిన్ అంతగా ఆ ఇంటేరియర్ కోసం ఖర్చు పెట్టింది అంటే... ఆమెకు ఆ ఇల్లు ఎంత స్పెషలో కదా.
మరి అడపా దడపా సినిమాలు చేసే క్యాథరిన్ కి అంత డబ్బు ఎక్కడిదని చాలామందే ఆశ్చర్యపోతున్నారు. కానీ క్యాథరిన్ కేవలం సినిమాల్లో నటించడమే కాదు... ఇంకా ఆమెకి బిజినెస్ లు కూడా ఉన్నాయట. మరి సినిమాల్లోనూ, ఆ బిజినెస్ ద్వారా వచ్చే డబ్బు తో అమ్మడు ఇలా కాస్ట్లీ మెయింటినెన్స్ చేస్తుందట.

