ఆ రెండు సినిమాల్లోనూ నాగ్ ఒకేలా కనిపిస్తాడట

ఈ మధ్యన నాగార్జున ఎక్కడ చూసిన మీసం లేకుండానే దర్శనమిస్తున్నాడు. అయితే ఏదో సినిమా కోసం నాగ్ మీసా లేకుండా తిరుగుతున్నాడనే ప్రచారం జరిగింది. అదే విషాయాన్ని నాగ్ ని అడగగా.... మీసం ఉంచినా ప్రాబ్లమ్.. తీసేసిన ప్రాబ్లమ్.. అంటూ సరదాగా నవ్వేసాడు. అయితే ఇప్పటివరకు మీసం లేని నాగ్ ఎలా ఉంటాడో కేవలం ఈ మధ్యలోనే చూసాం. ఇక ఇప్పుడు మీసం లేని నాగ్ ని వెండితెరపై కూడా చూడబోతున్నాం. అవును.. నాగార్జున తన అప్ కమింగ్ మూవీస్ లో మీసం లేకుండానే కనిపించడానికి ప్రిపేర్ అవుతున్నాడు నాగార్జున.
హీరోగా బాగా గ్యాప్ తీసుకున్న నాగార్జున ఈమధ్యకాలంలో సైలెంట్ గా 2 సినిమాలు ఎనౌన్స్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. అంతేకాకుండా అదే టైం లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై మరో సినిమా కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో నాగార్జున నాని తో మల్టీస్టారర్ చెయ్యబోతున్నాడు. అయితే రామ్ గోపాల్ వర్మ - నాగార్జున సినిమాకు డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ.... వైజయంతీ మూవీస్ బ్యానర్ పై మాత్రం జనవరి నుంచి సినిమా స్టార్ట్ అవుతుందని స్వయంగా నిర్మాత అశ్వనీదత్ అధికారికంగా ప్రకటించాడు.
అయితే ఈ రెండు సినిమాల్లో మీసం లేకుండానే నటించాలని నాగార్జున నిర్ణయించుకున్నాడట. అయితే నిజానికి మీసం తియ్యాలనే ఆలోచన నాగార్జునది కాదని...... ఓ సరికొత్త కథతో నాగ్ ను కలిసిన వర్మ.. నాగ్ ని మీసం తీసేయమని సలహా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. అలాగే శ్రీరామ్ ఆదిత్య సినిమా కూడా వర్మ సినిమాతో పాటే మొదలవుతుంది కాబట్టి ఈ సినిమాలోనూ మీసం లేకుండానే నటించాలని నాగార్జున డిసైడ్ అయ్యాడట.

