ఆ ఒక్క విషయంలోనే కన్ఫ్యూషన్ అంట

చిరు సై రా సినిమా రేపటినుండి సెట్స్ మీదకెళ్లబోతుందనే న్యూస్ ఉంది. ఎంతో ఆర్భాటంగా ఆగష్టు లో పూజ జరుపుకున్న సై రా నరసింహారెడ్డి సినిమా ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్ జరుపుకోలేదు. ఎట్టకేలకు రేపటినుండి సెట్స్ మీదకెళుతుంది అనుకున్న సమయంలో.. సై రా కి అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు సై రా టీమ్ సంకటంలో పడింది. సై రా నరసింహారెడ్డి ని నేషనల్ వైడ్ గా తెరకెక్కించి విడుదల చేసే ప్రయత్నంలో జాతీయ స్థాయిలో పేరున్న రెహ్మాన్ ని ఈ సినిమాకోసం ఎంచుకోవడం.. ఉన్నట్టుండి రెహ్మాన్ తప్పుకోవడంతో చిత్ర బృందం ఇప్పుడు టోటల్ కన్ఫ్యూషన్ లో పడింది.
మరి ఇప్పుడు రెహ్మాన్ కి ధీటుగా మరొక మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవడానికి సై రా టీమ్ కిందా మీద పడుతుంది. పోనీ సైరా మోషన్ పోస్టర్ చేసిన థమన్ ని తీసుకుందామా అంటే.. అంతకన్నా ఇంకెవరు దొరకలేదా అంటారేమో అనే భయం. కానీ రెహ్మాన్ కి ధీటుగా అంటే బాహుబలితో నేషన్ వైడ్ గా నేమ్ కొట్టేసిన కీరవాణి అయితే బావుంటుందా అనే ఆలోచనలో సై రా టీమ్ ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. అందులో భాగంగానే రెహ్మాన్ స్థానంలోకి కీరవాణిని రీప్లేస్ చెయ్యడానికి అప్పుడే చర్చలు కూడా ప్రారంభమయ్యానే న్యూస్ వినబడుతుంది. కానీ అది కన్ఫర్మ్ అయితే కాదు.
మరి ఇప్పుడు ఎంతలా ఆలోచించినా సై రా టీమ్ కి అటు థమన్, ఇటు కీరవాణి తప్ప మరో ఆప్షన్ లేదు. మరి దీనిబట్టి సైరా మ్యూజిక్ డైరెక్టర్ గా రామ్ చరణ్, సురేందర్ రెడ్డిలను ఎవరిని ఫైనల్ చేయబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే సై రా సినిమా సెట్స్ మీదకెళ్లడానికి చిరు కూడా రెడీగా ఉన్నాడు. ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లుక్ లోకి చిరు పూర్తిగా మారాడు. ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ తప్ప మిగతావన్నీ సై రా కి అనుకూలంగానే ఉన్నాయంటున్నారు.

