Wed Dec 10 2025 08:24:48 GMT+0000 (Coordinated Universal Time)
ఆమ్మో 7 కోట్లా...!

తమిళంలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయనతార ఈ మధ్యన ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఒక వైపు తన రెమ్యునేషన్ ని కేవలం వైట్ మనీగానే ఇవ్వమని ప్రోడుసుర్స్ ని పట్టుబడుతుందని అందుకే ప్రొడ్యూసర్స్ నయన్ కి ప్రత్యామ్నాయంగా ఇతర హీరోయిన్స్ వేటలో పడ్డారనే వార్తలు మరవకముందే ఇప్పుడు నయన్ మరో విధంగా నిర్మాతలకు కండీషన్స్ పెడుతుందని అంటున్నారు. నయనతార ఒకవైపు స్టార్ హీరోల పక్కన నటిస్తూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తుంది. ఇక తెలుగులో కూడా నయనతార ఒకప్పుడు టాప్ లెవెల్లో ఒక వెలుగు వెలిగింది.
అయితే ఇప్పుడు నయనతార గురించి ఒక వార్త కోలీవుడ్ సర్కిల్స్ లో తెగ హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే ఒక సినిమా కోసం నయనతార ఏకంగా 7 కోట్లు రూపాయలు డిమాండ్ చేసిందని సమాచారం. ఒకేసారి తన రెమ్యునరేషన్ ని 7 కోట్లు అడిగేసరికి నిర్మతలు అవాక్కయ్యారట. అసలు టాప్ హీరోలే తమ రెమ్యునరేషన్ ని 10 నుండి 20 కోట్ల వరకు తీసుకుంటారు. ఇక హీరోయిన్స్ అయితే సౌత్ లో 2 కోట్ల వరకు, బాలీవుడ్ లో అయితే 5 కోట్ల వరకు తీసుకుంటారు. మరి నయనతార ఎందుకింత డిమాండ్ చేసిందనే మీద ఇప్పుడు కోలీవుడ్ లో పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పటికే నయన్ సౌత్ సినిమాలో చెయ్యాలంటే 3 నుండి 4 కోట్లు డిమాండ్ చేసేది. అంత మొత్తమిస్తేనే లేకుంటే నో చెప్పేసేది. ఇక ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించాలంటే తనకి 7 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చితీరాలని పట్టుబడుతుందట.
ఇప్పటికే లేడి ఓరియెంటెడ్ చిత్రం లో నటించమని అడగగా నయన్ ఈ ఫిగర్ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. మరి నయన్ గనక అడిగింది ఇచ్చినట్లయితే ఆమె ఇండియాలోనే అత్యంత భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా చరిత్రలో నిలిచిపోతుంది.
Next Story

