ఆమె తరువాతే ఎవరైనా

అకస్మాత్తు నిర్ణయాలతో దేశం మొత్తాన్ని పరుగులు పెట్టించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చరవాణిల వాడకంలోనే సరికొత్త పోటీ వాతావరణాన్ని నెలకొల్పి ఇతర నెట్వర్క్స్ కి గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ముకేశ్ అంబానీలు భారత దేశంలోనే అత్యంత మంది ప్రజలని ప్రభావితం చేస్తున్న వ్యక్తులు. ఇది ఎవరో అంటున్న మాట అయితే కాదు. భారత దేశస్థులు అత్యధికంగా గూగుల్ లో సెర్చ్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రాతిపదికగా తీసుకుని వెల్లడించిన రిపోర్ట్స్.
ఎలాంటి వారినైనా తన వాక్చాతుర్యం తో ప్రభావితం చేయగలిగిన సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సారి తన చేతలతో టాప్ ట్రేండింగ్ లో వున్న మోదీ, అంబానీ లని కిందకి లాగేసి ప్రథమ స్థానాన్ని తన హీరోయిన్ మియా మాల్కోవా కైవసం చేసుకునేలా చేసాడు. ఇదంతా వర్మ రూపొందించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వల్లనే సాధ్యపడింది. ఈ నెల 26 న విడుదల కానున్న ఫుల్ వీడియో పై దేశస్థులలో ఎంత ఆసక్తి ఉందనేది ఈ గూగుల్ సెర్చ్ స్టాటిస్టిక్స్ తెలుపకనే తెలుపుతుంది. వర్మ స్వయంగా ఈ స్టాటిస్టిక్స్ ని తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.