ఆమె తప్పుకోలేదట... తప్పించారట..?

తమిళనాట సంఘమిత్ర సమస్య ఇంకా సద్దుమణిగినట్లు అనిపించడంలేదు. కోలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్ గా సంఘమిత్ర ని అనౌన్స్ చెయ్యడమే కాదు... సుందర్ సి డైరెక్షన్ లో గ్రాండ్ లాంచ్ కూడా చేశారు. అయితే సంఘమిత్ర రోల్ ప్లే చేస్తున్న హీరోయిన్ శృతి హాసన్ ఆ ప్రాజెక్ట్ నుండి అర్ధాంతరంగా తప్పుకుని సంఘమిత్ర యూనిట్ కి షాక్ ఇచ్చింది. ఇప్పుడు శృతి హాసన్ ప్లేస్ లోకి కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతార వచ్చి చేరిందని చెబుతున్నారు. అయితే ఈ చిత్రం నుండి శృతి హాసన్ తప్పుకోవటానికి ఆమె ఏవో కారణాలు వినిపించింది.
ఈ అవకాశాన్ని నేనే కావాలని వదులుకున్నా... కథ రెడీ అవ్వకుండా రెండేళ్లు డేట్స్ ఎలా ఇవ్వగలను అంటూ కహానీలు వినిపించింది. అయితే తాజాగా సంఘమిత్ర ప్రాజెక్ట్ నుండి చిత్ర యూనిట్ వాళ్ళే శృతి హాసన్ ని తప్పించినట్లు వార్తలొస్తున్నాయి. మరి వారికి అంతలా చిరాకు తెప్పించిన శృతి హాసన్ వారు తప్పించడానికి బోలెడు కారణాలు కూడా చూపెడుతున్నారు వారు. శృతి హాసన్ ని ఈ ప్రాజెక్టు కి ఎంపిక చేసినప్పుడు ఆమె భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా కాదనకుండా.... చిత్ర యూనిట్ ఆమెకు విదేశాల్లో బోలెడంత ఖర్చు పెట్టి మరీ యుద్ధ విన్యాసాల్లో శిక్షణ కూడా ఇప్పించారు. అంత చేసినా సినిమా కథ రెడీ అవలేదంటూ రాగాలు మొదలెట్టేసరికి సంఘమిత్ర టీమ్ షాక్ తిని ఇక శృతి ఓవరేక్షన్ తట్టుకోలేక ఇలా అసలు విషయం బయటపెట్టారనే టాక్ వినబడుతుంది.

