ఆమెపై వచ్చిన వార్తలన్నీ గాసిప్సేనా?

మలయాళంలో మలార్ గా తెగ పాపులర్ అయిన సాయి పల్లవి తెలుగులో ఫిదా తో అందరి మనుసులని ఫిదా చేసింది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్న సాయి పల్లవి ఎంసీఏ తో మరింత దగ్గరైంది. రెండు సినిమాలను హిట్ గా మార్చిన సాయి పల్లవి క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం శర్వానంద్ న్యూ మూవీలో నటిస్తున్న సాయి పల్లవి... తమిళంలో నాగ సౌర్య తో కలిసి కరు సినిమాలో నటించింది. ఆ సినిమానే తెలుగులో కణం టైటిల్ తో విడుదలకు సిద్దమయ్యింది.
అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొద్దీ కాలమే అయ్యింది. అప్పుడే సాయి పల్లవికి పొగరెక్కువ అని, ఆమెకు టైం సెన్స్ లేదని, అలాగే కణం సినిమా షూటింగ్ లో హీరో నాగ సౌర్యాని ఇబ్బంది పెట్టిందని, ఇక సాయి పల్లవి దెబ్బకి దర్శక నిర్మాతలు బెదిరిపోతున్నారనే న్యూస్ అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో నిన్న సోమవారం జరిగిన కణం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి పల్లవి చేసిన పని చూస్తుంటే మాత్రం ఆమె మీద వచ్చిన వార్తలన్నీ గాసిప్సేనా అనిపిస్తుంది. అదేమిటంటే కణం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సాయి పల్లవి చెన్నై నుండి హైదరాబాద్ కి ఫ్లైట్ లో వచ్చింది.
కానీ ఫ్లైట్ డిలే అవడంతో సాయి పల్లవి చక చకా హోటల్ కి వచ్చి రెడీ అయ్యి వెంటనే ప్రి రిలీజ్ ఈవెంట్ కి బయలుదేరింది. కానీ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో కారులో వెళ్లకుండా సాయి పల్లవి తన అసిస్టెంట్ బైక్ పై ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగే ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి చేరుకుంది. మరి ఇప్పుడు సాయి పల్లవి అలా బైక్ మీద వెళుతున్న ఆ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి టైం వెస్ట్ కాకుండా ఇలా సాయి పల్లవి చేసిన పనికి అందరూ అభినందిస్తున్నారు. ఇలాంటి అమ్మాయిపై టైం సెన్స్ లేదనే గాసిప్స్ ఎలా వచ్చాయబ్బా అంటూ అందరూ చర్చలు మొదలెట్టేసారు.

