Sun Dec 14 2025 19:33:56 GMT+0000 (Coordinated Universal Time)
ఆమెను దాచడం వెనుక అసలు సీక్రెట్ ఇదే

నిన్నశుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం పాసిటివ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. డిఫరెంట్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ ఎక్కడికిపోతావు... చిత్రం ప్రేక్షక అభిమానం చూరగొంది. ఈ సినిమాతో నిఖిల్ నటన పరంగా మంచి మార్కులు కొట్టేసాడు. ఈ సినిమాలో నిఖిల్ కి జోడిగా హెబ్బా పటేల్ , నందిత శ్వేతలు నటించారు . ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంలో నిఖిల్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. కానీ సినిమా షూటింగ్ మొదలైనప్పటినుండి ఈ సినిమాలో ఇద్దరి హీరోయిన్స్ మాత్రమే ట్రైలర్స్ లో, టీజర్స్ లో, చిత్ర పోస్టర్స్ లో ప్రమోట్ చేస్తూ వచ్చింది ఎక్కడికి పోతావు ... చిత్ర యూనిట్ . అందులో నటించిన మరో హీరోయిన్ అవికా గోర్ ని ఎక్కడా ప్రమోట్ చెయ్యడం గాని అసలామె ఎక్కడికి పోతావు... లో ఉన్నట్టు గాని చూపించలేదు. అసలెందుకు దర్శకుడు అవికాని హైలెట్ చెయ్యకుండా దాచి పెట్టాడు . మరి సినిమాలో కూడా ఎక్కువ శాతం అవికాని బురఖాలోనే చూపించాడు దర్శకుడు. అయితే అసలీ అవికా పేరుని కూడా టైటిల్ లో అందరి పేర్ల కన్నా చివర్లోనే వేశారు. మరి ప్రమోషన్ కూడా అవికాపేరు వాడకుండా ఆమెతో ఒక్క ఇంటర్వ్యూ ఇప్పించకుండా అసలెందుకు అంత గుట్టుగా దాచినట్టు.
అయితే దర్శకుడు ఆనంద్ మాత్రం అవికా కేరెక్టర్ ని దాచి పెట్టడం వాళ్ళ సినిమా మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేసాడు. అసలు ఇంకో హీరోయిన్ అవికా వుంటుందనే విషయం ప్రేక్షకుడికి సినిమా చూసే వరకు కూడా తెలియకుండా దాచగలిగాడు దర్శకుడు. ఇక దర్శకుడు చేసిన ప్రయత్నం ఫలించి ఈ సినిమాకి కీలకమైన మలుపు తిప్పే పాత్రలో అవికా కనబడి ప్రేక్షకుల సర్ప్రైజ్ చేసింది. ఇక సినిమాలో మంచి సస్పెన్సు థ్రిల్లర్ గా ప్రేక్షకాభిమానంచూరగొని హిట్ దిశగా సాగిపోతుంది.
Next Story

