Tue Dec 23 2025 14:16:34 GMT+0000 (Coordinated Universal Time)
ఆమెను చంపుతామంటున్నది ఎవరు? ఎందుకు?

అసలు సెలబ్రిటీస్ ఈ మధ్యన సోషల్ మిడిల్ లో బాగా యాక్టీవ్ గా తయారయ్యారు. ఇక సోషల్ మీడియా లో సెలబ్రిటీస్ ఎప్పటికప్పుడు తమ సినిమాల అప్ డేట్స్ తో పాటు తమ పర్సనల్ విషయాలను కూడా తమ అభిమానులతో పంచుకుంటూ ఆనందపడుతుంటారు. ఇక సెలబ్రిటీస్ ల అకౌంట్స్ ని కొంతమంది ఆకతాయిలు హాక్ చేసి స్టార్స్ ని ఇబ్బందుల్లో పడేస్తుంటారు. కొన్నిసార్లు స్టార్స్ వెంటనే కనిపెట్టి తమ అకౌంట్స్ హాక్ అయ్యాయని అందులో పోస్ట్ చేసే వాటికి తమకేం సంబంధం లేదని వివరణ ఇస్తారు. వీటివల్ల కొంతమంది సెలబ్రిటీస్ అయితే మనకెందుకులే అవన్నీ అని వదిలేస్తారు.
అసలిప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఒక విషయం వుంది. అదేమిటంటే టాలీవుడ్, కోలీవుడ్ లలో వరుస సినిమాలతో బిజీగా వున్న శృతి హాసన్ ని చంపుతామంటున్నారట. ఎవరో ఏమిటో తెలియదు గాని శృతిని చాపుతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడట. అసలు శృతి హాసన్ కి ఈ బెదిరింపులు గత సెప్టెంబర్ నుండే మొదలయ్యాయట. శృతి హాసన్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో కేజీ గురుప్రసాద్ అనే డాక్టర్ శృతిని చంపుతానంటూ మెస్సేజ్ లు పెడుతున్నాడు. చెప్పడానికి వీలులేని పదాలతో శృతి హాసన్ ని దూషిస్తూ పోస్ట్లు పెడుతున్నాడట. చాలా రకాలుగా కేజీ గురుప్రసాద్ శృతిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడట.
ఇక వీటిని భరించలేని శృతి తన మేనేజర్ తో కలిసి పోలీస్ లకి ఫిర్యాదు చేసిందట. దాదాపు రెండు పేజీల కంప్లైంటుని పోలీసులకు అందజేసిందని సమాచారం. ఇక ఈ ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీసులు ఆ డాక్టర్ ని వెతికే పనిలో పడ్డారట. అయితే శృతి హాసన్ పై ఇంతకుముందు కూడా ఒక దుండగుడు దాడికి పాల్పడ్డాడు. మరి ఆ దుండగుడు ఈ డాక్టరు ఒక్కరేనా అనే కోణం లో కూడా పోలీస్ లు విచారిస్తున్నారట.
Next Story

