అస్సలు తగ్గడం లేదు

వీహెచ్ 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలంటూ రోడ్డెక్కి మరీ మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాదు.... 'అర్జున్ రెడ్డి' సినిమా చూసి యువతా పక్కదారి పట్టే అవకాశం ఉందంటూ సిట్ అధికారి అకున్ సబర్వాల్ కి ఫిర్యాదు చేస్తానంటూ నిన్న మంగళవారం నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. అలాగే 'అర్జున్ రెడ్డి' సినిమా చూసి తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ 'అర్జున్ రెడ్డి' చిత్ర టీమ్ ని పొగడం చూసిన వీహెచ్ కేటీఆర్ విజయ్ దేవరకొండ చుట్టమేమో అందుకే ఇలా పొగిడాడంటూ కామెంట్ కూడా చేసాడు. అయితే వీహెచ్ ను తాతయ్యా అని పిలుచుకునే హీరో విజయ్ మాత్రం వీహెచ్ విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు.
తాతయ్య చేసిన రచ్చకి ఇంతకుముందు కౌంటర్ వేసిన విజయ దేవరకొండ మళ్ళీ తన మాటల తూటాలతో ట్విట్టర్ లో చెలరేగిపోయి మరీ వీహెచ్ మీద కౌంటర్ వేసాడు. ట్విట్టర్ లో వీహెచ్ ని ఉద్దేశించి విజయ్ డియర్ తాతయ్యా.. 'అర్జున్ రెడ్డి' సినిమా బాగుందని కేటీఆర్ మెచ్చుకోవడంతోనే ఆయన నాకు బంధువైతే.. మరి 'అర్జున్ రెడ్డి' సినిమా చూసి బాగుందని అప్రిషెట్ చేసేవాళ్ళు కూడా నాకు బందువువులే అవుతారు కదా. ఆ లెక్కన 'అర్జున్ రెడ్డి' చూసి నా పెరఫార్మెన్సు బావుంది అని చెప్పిన డైరెక్టర్ రాజమౌళిగారు నాకు నాన్న అవుతారు.
అంతేకాకుండా సినిమా చూసి 'అర్జున్ రెడ్డి' సూపర్ అంటూ 'అర్జున్' రెడ్డి టీమ్ ని పొగిడిన హీరోలు రానా, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్ నాకు సోదరులవుతారు.. అలాగే నాకు సోదరీమణులు లేరు కాబట్టి సమంత, అనూ ఇమ్మాన్యుయేల్, మెహ్రీన్ లు నాకు మరదళ్ళు అవుతారు.. ఈ అయిదు రోజుల్లో అయిదు వేల ప్రదర్శనలను ఫుల్ చేసిన పురుషులు, మహిళలు అంతా నా కవలలు. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సర్ అయితే మన ఇద్దరిలో ఎవరి తండ్రో ఇంకా క్లారిటీ లేదు.... తాతయ్యా... చిల్ అంటూ మళ్ళీ వ్యంగ్యఅస్త్రాలు సంధించాడు.
మరి మనవడు విజయ్ దేవరకొండ కామెంట్స్ కి వీహెచ్ ఇంకెలా సమాధానం చెబుతాడో వెయిట్ అండ్ సి అంటున్నారు.

