అసలు లుక్ ఏంటి బాబు!!

'బాహుబలి' తర్వాత దేశంలోని అన్ని వుడ్‌లలో ప్రభాస్‌కి మంచిఫాలోయింగ్ ఏర్పడినేషనల్స్టార్గా మారాడు. దాంతో ఆయనతో తదుపరిచిత్రానికి మొదట బడ్జెట్ 50 కోట్లు అనుకున్న యువి క్రియేషన్స్ అధినేతలైన ప్రమోద్, వంశీ, దర్శకుడు సుజిత్‌లు ఏకంగా బడ్జెట్‌ని మూడింతలు చేసి 150 కోట్లకు పెంచేశారు. ఇక యువిక్రియేషన్స్లో ప్రభాస్‌కి కూడా భాగస్వామ్యం ఉందనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. జస్ట్ శాంపిల్‌గా ఓ టీజర్‌ని విడుదల చేసి దుబాయ్‌లోని బిల్దింగ్లను చూపిస్తూన్నారు.
ఇక తాజాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఎందరో హీరోయిన్లను పరిశీలిస్తూ ఫైనల్ చేయలేకపోతున్నారు. కానీ సినిమాలోని మిగిలిన క్యాస్టింగ్ విషయంలో మాత్రం జోరును పెంచారు. ఇందులో మెయిన్ విలన్‌గా నీల్‌నితిన్ ముఖేష్‌ని తీసుకుని ఆయన మీద షూటింగ్ కూడా చేస్తున్నారు. అది చాలదన్నట్లు మరో హిందీ నటుడు చుంకీపాండేను కూడా ఓ పాత్రకు తీసుకున్నారు. మరోవైపు జాకీ ష్రాఫ్ కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. దీంతో బాలీవుడ్ ప్ష్రేక్షకులను అలరించే క్యాస్టింగ్ రెడీ అయింది.
ఇక తమిళ ప్రేక్షకులకోసం రామ్‌చరణ్ 'బ్రూస్లీ'లో నటించిన అరుణ్ విజయ్‌కుమార్‌ని కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్గా మాత్రం బాలీవుడ్‌కి చెందిన నటే ఉంటుందని చెప్పవచ్చు. ఆమధ్య ప్రభాస్‌కి చెందిన ఓ లుక్ ఫోటోలు దర్శనమిర్చాయి. ఇక టీజర్లో ఆల్రెడీ ఓ లుక్ ఉంది. తాజాగా ప్రభాస్ నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి కూతురి వివాహంలో పొట్టిగా ఉన్న జుత్తుతో మరో గెటప్‌లో కనిపించాడు. మరి ఇంతకీ ఆయన 'సాహె'లో కనిపించనున్న లుక్ ఏమిటి? అనేది సస్పెన్స్‌గా మారింది.

