అసలు ప్రేమంటే ఇష్టమే లేదట!!

నాకు అసలు ప్రేమంటే ఇష్టమే లేదు అని అంటున్నది ఎవరో కాదు హాట్ భామ హన్సిక. నిన్నమొన్నటి దాకా శింబు తో పీకల్లోతు ప్రేమాయణం సాగించిన హన్సిక ఇప్పుడు ప్రేమంటే అసలు పడడం లేదట. ఈమె తెలుగులో హీరోయిన్ గా దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇటు తెలుగుతో పాటే అటు తమిళం లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఈమెకు తమిళనాట ఒక గుడిని కట్టేశారు హన్సిక ఫాన్స్. హన్సిక తమిళ సినిమాలో నటించి అక్కడ చాలామంది ఫాన్స్ ని తయారు చేసుకుంది. ఇక ఫాన్స్ కి ఏం వచ్చిన పట్టలేం కదా అందుకే హన్సిక కి అక్కడ ఫాన్స్ ప్రేమతో గుడిని నిర్మించారు. హన్సిక తెలుగులోకన్నా తమిళం లేనే బిజీ తారగా మారిపోయింది.
ఇక తమిళ హీరో శింబుతో ఒక సినిమా చేస్తూ అతనితో ఘాటు ప్రేమలో పడింది. కొన్ని రోజులు వీరి ప్రేమ బాగానే వుంది. అయితే శింబు, హన్సిక ఎందుకో సడన్ గా బ్రేక్అప్ అయ్యారని ఆ మధ్యన కోలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇక శింబు కూడా సైలెంట్ గా పాత ప్రియురాలు నయనతారకి దగ్గరవడానికి ట్రై చెయ్యడం తో హన్సిక పూర్తిగా శింబు కి దూరమై.... అతనితో వున్న రిలేషన్ ని కట్ చేసుకుంది. ఇక శింబు ని పూర్తిగా మర్చిపోయిందనుకున్న టైములో హన్సిక నాకు ప్రేమంటే అసలు ఇష్టం లేదని ఇక ఎప్పటికి ప్రేమలో పడనని ఘాటుగా స్పందించింది. ఒక్క ప్రేమకే హన్సిక ఎంత బాగా బుద్ది తెచ్చుకుంది అంటున్నారు సినీజనాలు.

