అవి అన్ని ఫేక్ న్యూస్

మొదటి నుండి 'సాహో' చిత్రం ఏదొ ఒక వార్త వచ్చి ఫ్యాన్స్ ని ఖంగారు పెట్టిస్తోంది. దుబాయ్ లో షూటింగ్ చేయాలనుకున్న 'సాహో' టీంకు ఇంకా పర్మిషన్ రాలేదని దాని వల్ల షూటింగ్ లో మరింత జాప్యం జరగవచ్చు అనే వార్తలు కొన్ని వెబ్ సైట్స్ లో రావడంతో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ ఇందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది.
విశ్వసనీయమైన సమాచారం మేరకు ఈ చిత్ర షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వడం అనుమతులు రాకపోవడం గాని ఏది జరగలేదు. అవ్వని ఫేక్ న్యూస్ అని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. అనుకున్నట్టుగానే మార్చ్ 20 నుంచి యూరప్ - దుబాయ్ లలో సాహో షూటింగ్ నిర్విరామంగా జరగబోతోంది. షెడ్యూల్ లో కొద్ది మార్పులు జరిగాయి తప్ప ప్లానింగ్ లో ఎటువంటి మార్పు ఉండదని సమాచారం.
ఓ రెండు పాటల చిత్రీకరణ కూడా ఇందులోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో చాలా కీలకమైన యాక్షన్ సన్నివేశాలు దర్శకుడు సుజిత్ షూట్ చేయబోతున్నాడు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ ఎహ్సాన్ లాయ్ మొదటిసారి తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నారు

