అవినాష్ పేరెంట్స్ ని చూసారా?

అఖిల్ 'హలో' సినిమా విడుదలకు ఇంకా కేవలం 30 రోజులు మాత్రమే ఉంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ 'హలో' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఫుల్ రొమాంటిక్, ఫ్యామిలీ, యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ మాత్రం 'హలో' సినిమాకే హైలెట్ అయ్యేలా కనబడుతున్నాయి. అయితే ఈ సినిమాలో అఖిల్, అవినాష్ గా కనబడుతున్నాడు. మొన్నామధ్యన సినిమాలోని పాత్రల పరిచయాలకు టైం వచ్చేసిందంటూ తనని తాను... అవినాష్ కి 'హలో' చెప్పండి అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ ట్వీట్ చేసాడు.
అలాగే నిన్నటికి నిన్న అంటే బుధవారం సాయంత్రం అవినాష్ పేరెంట్స్ ని పరిచయం చేసాడు. 'హలో' సినిమాలో అఖిల్ తల్లితండ్రులుగా జగపతి బాబు, రమ్యకృష్ణలు కనబడుతున్నారు. ఇక వాళ్ళని కూడా ఒక అందమైన ఫోటో తో పరిచయం చేస్తూ... అవినాష్ అమ్మానాన్నలు అయిన వీరికి పెద్ద 'హలో' చెప్పండి అంటూ... వారిద్దరితో కలసి పనిచేయడం ఎంతో హ్యాపీ గా ఉందని..... జగపతిబాబు గారు తన చల్లని హృదయంతో.. రమ్యకృష్ణ మామ్ నాచురల్ అండ్ ఎవర్ గ్రీన్ అందచందాలతో సినిమాకు కొత్త అందం తెచ్చారు.. అంటూ పోస్ట్ చేసాడు.
మరి తనకి, తన తల్లితండ్రులకు 'హలో' చెప్పమన్న అఖిల్ తన గర్ల్ ఫ్రెండ్ ని ఎప్పుడు పరిచయం చెయ్యబోతున్నాడో?.... ఈ సినిమాలో అఖిల్ సరసన ప్రియదర్శిన్ కుమార్తె కళ్యాణి హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని నాగార్జున నిర్మిస్తుండగా.. డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

