అవకాశాలొస్తున్నా ఆ సినిమా విడుదల కోసమే ఆగుతుంది

తెలుగు, తమిళ సినీపరిశ్రమలో కూడా వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. హిట్స్ తో సంబంధంలేకుండా తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ నటించిన తాజా చిత్రం 'స్పైడర్' ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పైడర్' చిత్రంలో మొదటిసారి మహేష్ సరసన జోడి కడుతున్న ఈ భామ 'స్పైడర్' లో డాక్టర్ గా కనిపించనుంది. ఇక ఈ సినిమాలో మహేష్ తో పాటు అందంలో పోటీపడుతున్నట్టే కనబడుతుంది.
ఇక దక్షిణాదిని రకుల్ ప్రీత్ జోరు ఒక రేంజ్ లో ఉంటే ఇప్పుడు ఉత్తరాదిన కూడా రకుల్ ప్రీత్ వరుస అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుందట. రకుల్ బాలీవుడ్ లో నీరజ్ పాండే దర్శకత్వంలో 'అయియారీ' అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా కు జోడిగా నటిస్తుంది. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా ప్రస్తుతం బాలీవడ్ లో ప్లాప్ హీరోనే. ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవడంతో సిద్దార్థ్ కి పెద్దగా క్రేజ్ లేదుగాని.. దర్శకుడు నీరజ్ పాండే కు మాత్రం మంచి క్రేజ్ ఉంది. నీరజ్ పాండే బాలీవుడ్ టాప్ దర్శకుడు.
నీరజ్ పాండే సినిమాలకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయక్కడ. మరి ఈ చిత్రంలో రకుల్ ని నీరజ్ పాండే ఎలా చూపించినా.... ఇప్పుడు రకుల్ ఆ సినిమా విడుదలయ్యేసరికి టాప్ హీరోల దృష్టిలో పడినా ఆశ్చర్యపోవక్కర్లేదంటున్నారు. అయితే రకుల్ కి ఇప్పటికే బాలీవుడ్ అవకాశాలు తలుపుతడుతున్నాయట. అయితే రకుల్ మాత్రం 'అయియారీ' సినిమా విడుదల కోసమే వచ్చిన అవకాశాలు పక్కన పెడుతుందట. మరి దక్షిణాది భామలు బాలీవుడ్ లో క్లిక్ కానీ నేపథ్యంలో రకుల్'అయియారీ' హిట్ అయితేనే బాలీవుడ్ లో ఉందామనుకుంటుందేమో... అందుకే వచ్చిన అవకాశాలను పెద్దగా పట్టించుకోవడంలేదంటున్నారు.