అల్లువారి ఆడవాళ్లు ఎలా వున్నారు

అల్లు అర్జున్ ఎప్పుడూ సోషల్ మీడియా అంటే ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వాటిల్లో చురుగ్గా ఉండడమే కాదు.. అందరిలోకెల్లా ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన హీరోగా కూడా ఉన్నాడు. తన ప్రతి విషయాన్నీ ఇలా ఫేస్ బుక్, ట్విట్టెర్స్ లో పోస్ట్ చేస్తూ అభిమానులకు తనెంత దగ్గరగా ఉన్నాడో చెబుతుండేవాడు. అయితే వీటన్నిటిలో ఫాస్ట్ గా వుండే ఆలు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం లేట్ గా జాయిన్ అయ్యాడు. ఇక అందులో అలా అకౌంట్ ఓపెన్ చేసాడో లేదో తన గారాల పట్టి అర్హ ఫోటోని పోస్ట్ చేసి కేక పెట్టించాడు.
అలాగే తాను చేస్తున్న సినిమాలతో పాటే తన ఫ్యామిలీ విషయాలను కూడా అందులో షేర్ చేసుకుంటున్నాడు. అందులో తన కూతురు అర్హ బర్త్ డే ని సింగపూర్ లో సెలెబ్రేట్ చేసుకున్నట్లు చెప్పిన ఆలు అర్జున్ ఇప్పుడు తమ ఇంటి ఆడవాళ్ళైనా తన తల్లి, భార్య, కూతురు, వదినగారు ఉన్న ఆ ఫోటో తో పాటే.. దీపావళి సెలెబ్రేషన్స్ అంటూనే... స్వీట్ హార్ట్స్ మై లైఫ్ అంటూ టాగ్ చేసాడు. మరి ఆ ఫోటో చూస్తుంటే మాత్రం అల్లువారమ్మాయిలు అదిరే అనిపిస్తుంది. అల్లు అర్జున్ తల్లీ వెనుకగా నుంచుంటే అల్లు అర్జున్ వదిన, అల్లు అర్జున్ అన్న కూతురు, భార్య స్నేహ, కూతురు అర్హ కూర్చుని అందమైన ఫోటోకి క్యూట్ గా ఫోజులిచ్చారు.
మరి ఈ ఫోటో ని చూస్తుంటే... అల్లు అర్జున్ తన ఫ్యామిలీకి ఎంతగా ఇంపార్టెన్స్ ఇస్తాడో తెలుస్తుంది. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం దర్శకత్వంలో నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలవుతుంది.


