అలాంటిదేం లేదు బాబోయ్

గత నెల రోజులుగా బొద్దుగుమ్మ నమిత.. సీనియర్ నటుడు శరత్ కుమార్ తో సహజీవనం.. త్వరలోనే పెళ్లి అంటూ రకరకాల కథనాలు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 60 ఏళ్ళ నటుడు అయిన శరత్ కుమార్ రెండు పెళ్లిళ్లు పెటాకులవడం మరో పెళ్ళికి నేను సిద్దమని చెప్పిన తర్వాత.. ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. నమిత కూడా అవకాశాలు లేక.. తమిళ బిగ్ బాస్ నుండి రెండు వారాల్లోనే బయటికి వచ్చేయడం.. ఈ పెళ్లి విషయం వంటి విషయాలతో విపరీతంగా హైలెట్ అయ్యింది. అయితే ఇన్ని రోజులుగా వస్తున్న పుకార్లపై నమిత ఎట్టకేలకు స్పందించింది.
నమిత పెళ్లి, సహజీవనం వంటి విషయాలపై వస్తున్న వార్తల్లో నిజం లేదని... అసలు శరత్ బాబు ఎవరో కూడా తనకి తెలియదని... ఈ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాకే శరత్ బాబు గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేశానని... అసలు నా వయసుకంటే ఎంతో ఎక్కువైనా ఆ నటుడితో తన పెళ్లి అని వస్తున్న వార్తల్లో అసలు నిజమే లేదని.. నమిత స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు తన చేతిలో ఎటువంటి అవకాశాలు లేకపోయినా ప్రస్తుతం తాను తన కుటుంబంతో ఎంతో హ్యాపీగా గడుపుతున్నానని.. ఇలాంటి టైం లో తన మీద ఇలాంటి పుకార్లు రావడం బాధాకరమని చెబుతుంది.
ఇక చేతిలో అవకాశాలు లేని నమిత ఇప్పుడు జీవితంలో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నట్లుగా... అలాగే రాజకీయాలపై తాను దృష్టి సారిస్తున్నట్లుగా చెబుతుంది. ఇక రాజకీయాల్లో తన భవిష్యత్తు ఎలా వుండబోతుందో కాలమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చింది. మొత్తం మీద శరత్ బాబు కి నమిత కి పెళ్లి అని వస్తున్న వార్తలన్ని ఒట్టి పుకార్లేకాని అందులో ఎటువంటి వాస్తవం లేదనేది పూర్తి క్లారిటీ వచ్చింది.

