అర్జున్ రెడ్డి రెండు వారాల బాదుడు

తెలుగు సినీపరిశ్రమలో అర్జున్ రెడ్డి పెద్ద సునామి. చిన్న సినిమాగా విడుదలై కోట్లు కొల్లగొట్టేస్తుంది. ఇప్పటికే రెండు వారలు ముగిసినా అర్జున్ రెడ్డి కలెక్షన్స్ కి మాత్రం అడ్డుకట్ట పడడంలేదు. కలెక్షన్స్ సునామి మాములుగా లేదు. కేవలం నాలుగు కోట్లతో తెరకెక్కిన ఈ అర్జున్ రెడ్డి సినిమా రెండు వారాల్లోనే 22.72 కోట్ల షేర్ సాధించి ఔరా అనిపించింది. అర్జున్ రెడ్డి తర్వాతి వారం విడుదలైన బడా బడ్జెట్ సినిమా పైసా వసూల్ కలెక్షన్స్ అర్జున్ రెడ్డి కలెక్షన్స్ ముందు వెలవెల బోయాయి అంటే అర్జున్ రెడ్డిలో దమ్మెంతుందో అంటూ చర్చలకు తెరలేపారు. ఇక నిన్న శుక్రవారం విడుదలైన నాగ చైతన్య యుద్ధం శరణం, మేడ మీద అబ్బాయి సినిమాలు కూడా డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో అర్జున్ రెడ్డి కి మరో వారంపాటు ఎదురులేకుండా పోయిందంటున్నారు. ఈలెక్కన కొనసాగితే అర్జున్ రెడ్డి మరి కొన్ని కోట్లు కొల్లగొట్టి చిన్న చిత్రం కూడా సునామి సృష్టించొచ్చంటూ నిరూపిస్తుందంటున్నారు. ఇక రెండు వారాల అర్జున్ రెడ్డి లెక్కలు మీకోసం...
ఏరియా రెండు వారాల షేర్ కోట్లలో
నిజాం 7.98
సీడెడ్ 1.95
నెల్లూరు 0.38
కృష్ణ 1.00
గుంటూరు 0.99
వైజాగ్ 1.31
తూర్పు గోదావరి 0.92
పశ్చిమ గోదావరి 0.54
మొత్తం ఏపీ మరియు తెలంగాణ షేర్ 15.07
కర్ణాటక 1.14
రోయ్ & రో 1.14
యుఎస్ఏ 5.37
వరల్డ్ వైడ్ రెండు వారల కలెక్షన్స్ 22.72