Tue Mar 31 2026 21:58:04 GMT+0530 (India Standard Time)
అర్జున్ పై దాడి

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కు షూటింగ్ స్పాట్ లో చేదు అనుభవం ఎదురైంది. అర్జున్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం సందీప్ ఆర్ పింకీ ఫరార్ .ఈ చిత్రంలో అర్జున్ కపూర్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఉత్తరాఖండ్ లో జరుగుతుంది.
ఈ చిత్రం చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఒక తాగుబోతు డ్రైవర్ అర్జున్ కపూర్ ఉన్న వానిటీ వన్ లోపలి వచ్చి షేక్ హ్యాండ్ అడిగాడు.. అర్జున్ కపూర్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో అతడి చేతును పట్టుకొని తిప్పాడు. అనంతరం మద్యం మత్తులో అతడిపై దాడికి దిగాడు.
అర్జున్ కపూర్ అనుచరులు వెంటనే అతడ్ని పక్కకి లాగి దగ్గర్లోని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని మద్యం మత్తులో వాహనం నడుపుతున్నందుకు 500 రూపాయల జరిమానా వేయడంతో పాటు.. ఆర్టీవో అధికారులను అతడి లైసెన్స్ ను రద్దు చేయాల్సిందిగా కోరారు.
Next Story

