అమ్మో ఒకే ఫ్రేమ్ లో!!

బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ నిత్యం ఏదో ఒక వార్తతో మీడియాలో నానుతూ ఉంటుంది. సినిమాల కన్నా తన పర్సనల్ లైఫ్ విషయాలమీదే ఎక్కువగా మీడియాలో ఉంటుంది. నీర్జా సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకొచ్చిన సోనమ్, ఇప్పుడు కూడా తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని... మీడియాకి తరుచు దొరికిపోతుంది. అందాల ఆరబోతతో ఎప్పుడు హడావిడి చేస్తూ ఉండే సోనమ్ కపూర్, ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకే కాదు సగటు ప్రేక్షకుడికి కూడా కైపెక్కించే సోనమ్ ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ తో కలిసి సెల్ఫీ దిగి మరీ సోషల్ ఇండియాలో పోస్ట్ చేసింది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు అనుష్క శర్మ. అనుష్క శర్మ కూడా సినిమాల కంటే ఎక్కువగా బాయ్ ఫ్రెండ్ విరాట్ మీద ఫోకస్ పెడుతుంది. బాయ్ ఫ్రెండ్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో షాపింగ్స్, పార్టీస్ అంటూ హంగామా చేసే ఈ భామ, సోనమ్ కలిసి తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రేండింగ్ అయ్యింది.
మరి ఒకే ఫ్రేమ్ లోఇలా ఇద్దరు సుందరాంగులు కనబడితే జనాలు ఆగుతారా... అందుకే వీరి సెల్ఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 10 గంటల్లోనే 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చేశాయంటే.. జనాలకు ఈ సెల్ఫీ ఎంతగా నచ్చేసిందనే సంగతి తెలిసిపోతుంది. మరి మీరు ఈ పిక్ మీద ఓ కన్నేయండి.


