అమ్మో ఎంతందం

ఎలాంటి హీరోయిన్ అయినా వయసు పెరిగేకొద్దీ అందమూ తరుగుతూ వస్తుంది. అందుకే పెళ్లైయ్యాక హీరోయిన్స్ కి ఆఫర్స్ చాలా తక్కువగా వస్తాయి. ఇక పెళ్ళై పిల్లలు ఉన్నారంటే ఆమెకి ఇక హీరోయిన్ గా ఒక్క అవకాశము రాదు. కానీ వయసొచ్చినా అందంలో ఇసుమంతైనా తగ్గకుండా.... పెళ్ళైనా కూడా ఆకర్షణ తగ్గకుండా.... పిల్లలు పుట్టినా వన్నెతరగని అందంతో ఇప్పటికి అందగత్తెలు కు పోటీ ఇస్తుంది బాలీవుడ్ భామ ఐశ్వర్య రాయ్. బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికి అంటే పెళ్లైన ఏమాత్రం తగ్గలేదంటేనే ఆమెకెంత క్రేజ్ ఉందొ అర్ధమవుతుంది.
ఇప్పటికి సినిమాల్లో హీరోయిన్ పాత్రలేస్తు.. మ్యాగజైన్స్ మీద కవర్ పేజీ లకి ఫోజులిస్తుంది. మ్యాగజైన్ కవర్ పేజీ మీదకెక్కడానికి ఇప్పటికి హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయించుకుంటుంది ఐష్. అందులో భాగంగానే ఫెమినా 2018 కవర్ పేజీ మీద ఐశ్వర్య రాయ్ ఫోటో ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. మరి ఆ ఫోటో లో ఐశ్వర్య రాయ్ ఉంగరాల జుట్టుతో మత్తెక్కించే చూపుతో.... చైనీస్ కాలర్ ఉన్న మెటాలిక్ సిల్వర్ కలర్ కోటు వేసుకుని చూస్తున్న ఐష్ నిచూడండి ఇప్పటికింకా నా వయసు నిండా పదహారు అన్నట్టుగానే వుంది ఆమె అందం.
మరి ఆ కవర్ పేజీ మీద ఐశ్వర్య రాయ్ ని చూసిన ఎవరైనా ఎంతందం ఎంతందం అన్నట్టుగా చూపు తిప్పుకోలేని అందంతో అదరగొట్టేస్తూ కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేసి మళ్ళీ బిజీ అయ్యే అవకాశాలు బాగానే ఉన్నాయ్ అంటున్నారు. . ఇక రెండు దశాబ్దాల పాటు మన హృదయాలను కొల్లగొడుతున్న ఐశ్వర్య రాయ్ అంటూ ఫెమినా వారు ఐష్ హాట్ ఫోటో పెట్టి దానికింద అలా క్యాప్షన్ కూడా పెట్టారు.


