అమ్మో అస్సలు తగ్గడం లేదు!!

ధనుష్ తమిళంలో నటించిన 'విఐపి' చిత్రం ఇక్కడ తెలుగులో 'రఘువరన్ బిటెక్' గా విడుదలై హిట్టయ్యింది. అయితే ఇప్పుడు ధనుష్ నిర్మతాగా.. హీరోగా మళ్లీ 'విఐపి' సీక్వెల్ గా 'విఐపి 2 ' ని చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో 'విఐపి 2 ' పేరు తోనే విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. అయితే ధనుష్ - కాజోల్ - అమలాపాల్ లు ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈచిత్రం ఈ నెల 28 నే విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు రైట్స్ దక్కించుకోవడానికి ఒకరిద్దరు నిర్మాతలు బాగా ట్రై చేశారు. కానీ ధనుష్ మాత్రం వాళ్ళకి దిమ్మతిరిగే రేటు చెప్పి ఖంగు తినిపించాడట.
'విఐపి 2 ' తెలుగు రైట్స్ కావాలంటే 12 కోట్లు ఇవ్వాల్సిందే అంటున్నాడట. మరి ఒక్కసారే అంత రేటు చెబితే ఎవరు కొంటారు చెప్పండి. అందుకే ఇప్పటివరకు తెలుగు రైట్స్ ని కొనడానికి నిర్మాతలెవరు ముందుకు రావడం లేదట. మరి సినిమా విడుదల దగ్గర పడుతుంది. కానీ ధనుష్ సినిమాని అంత రేటు పెట్టి కొన్నాక కూడా మరో కోటి రూపాయలు ఖర్చులు, పబ్లిసిటీకి పెట్టాల్సి వస్తుంది. మొత్తం అంతా కలిపి దాదాపు 13 కోట్ల దాకా అవుతుంది. కాబట్టి ఆ సినిమా కొనడానికి తెలుగు నిర్మాతలకు ఆసక్తి పోయిందంటున్నారు.
మరి రజినీకాంత్ సినిమాలంటే అడిగినంతా ఇచ్చేస్తారు గాని ఇలా మిగిలిన హీరోలు అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు జంకుతారు. అందులోనూ సూర్య, కార్తీ సినిమాలకే అంత రేటు లేదంటున్నారు. మరి ఒకవేళ ధనుష్ సినిమాని 12 కోట్లకి కొన్నా కూడా డబ్బులు వస్తాయని గ్యారెంటీ ఏంటంటూ క్వచ్చన్ చేస్తున్నారు సదరు నిర్మాతలు.

