అమ్మడు కి బాగా ఎక్కువైంది!

రామ్ చరణ్ తో చిరుత సినిమాలో నటించిన నేహా శర్మ... ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్దగా సోదిలోకి లేకుండా పోయింది. ఏదో బాలీవుడ్ లో సెటిల్ అయినా కానీ అక్కడ గట్టిగా నిలదొక్కులేక ఇప్పుడు చెల్లెలు ఐషా శర్మను లైన్ లోపెట్టే పనిలో బిజీగా వుంది. అందులో భాగంగానే నేహా శర్మ తన చెల్లెలితో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేపించి సోషల్ మీడియా లో వదులుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఐషా శర్మ అందరికి పరిచయం అయ్యింది. కేవలం పరిచయమే కాదు అమ్మడు చేయించుకున్న హాట్ ఫోటో షూట్స్ వలన బోలెడంత క్రేజ్ కూడా సంపాదించుకుంది.
ఆమె చేయించుకునే హాట్ ఫోటో షూట్స్ తో పాటు కింగ్ ఫిషర్ క్యాలెండర్ కోసం బికినీ షో చెయ్యడం ఇలాంటి వాటితో ఐషా శర్మ సోషల్ మీడియాలో బాగానే హల్చల్ చేసింది. ప్రస్తుతం ఐషా సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా లేదు. సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో ఆరితేరిపోయిందా అన్నట్లుగా తయారైంది. తాజాగా ఐషా శర్మ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన హాట్ పిక్ వైరల్ అయ్యింది. బ్లాక్ డ్రెస్ లో ఐషా శర్మ లుక్ అదిరిపోతున్నా.. అందులో ఆమె కవ్వించే చూపు కూడా మాములుగా లేదు. మరి తన అందాలతో అంతగా మాయ చేసేస్తోంది ఐషా శర్మ.

అయితే తనలో ఇంత అందం దాగి ఉందని చూపించడానికి కెమెరా మ్యాన్ పని తనం గొప్పదని.. అలాగే తనని మరింత అందంగా చూపించడానికి కష్టపడిన మేకప్ మ్యాన్ ని కూడా పొగిడేస్తోంది ఈ భామ. మరి ఇంత అందాన్ని వెండితెర మీద ఎప్పుడు చూస్తామో కరెక్ట్ గా క్లారిటీ లేదుగాని.. ప్రస్తుతానికి ఐషా శర్మని ఇలా సోషల్ మీడియా లో చూస్తూ ఆరాధిస్తూ అలసిపోవడం తప్ప చేసేదేం లేదు. మరి అమ్మడు అక్కలా కాకుండా గట్టిగా వెండితెర మీద నిలదొక్కుకుని నిలబడుతుందో లేదో అనేది ఆమె లక్కు మీదే ఆధారపడి ఉంటుంది.

