అమ్మడుకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందా?

ఆగష్టు 11 న రెండు సినిమాల్తో పోటీ పడిన 'లై' చిత్రం భారీ ప్లాప్ దిశగా పరుగులు తీస్తుంది. ఈదెబ్బకి ఈ సినిమాలో నటించిన మేఘ ఆకాష్ కి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందంటున్నారు. అసలు గౌతమ్ మీనన్ సినిమాతో వెండితెరకు పరిచయం అవ్వాల్సిన మేఘ ఆకాష్ అనుకోకుండా నితిన్ 'లై' సినిమాతో వెండితెరకు అలాగే టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఈ 'లై' సినిమా షూటింగ్ ప్రాసెస్ లో ఉండగానే రామ్ పోతినేని - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కనున్న 'ఉన్నది ఒకటే జిందగీ'లో ఆఫర్ ఇచ్చి మేఘాని ఎంపిక చేసారు. అలాగే నితిన్ కూడా త్రివిక్రమ్ - పవన్ నిర్మతలుగా చేయనున్న ఫిలింలో కూడా మేఘానే హీరోయిన్ గా ఎంపిక చేసాడు.
అయితే మేఘ ఆకాష్ కారణం క్లారిటీ ఇవ్వకుండా డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేననే వంకతో రామ్ సినిమాకి హ్యాండ్ ఇచ్చింది. ఇక రామ్, కిషోర్ లు కూడా మేఘ స్థానంలోకి లావణ్య త్రిపాఠిని సెట్ చేసుకున్నారు. ఇకపోతే అమ్మడుకి 'లై' సినిమా షూటింగ్ సమయంలోనే కొంతమంది నిర్మాతలు తమ సినిమాల్లో అవకాశం ఇస్తామంటూ ఆమె వెంట పడ్డారట. అయితే 'లై' సినిమా హిట్ తో ఓవర్ నైట్ లో స్టార్ట్ హీరోయిన్ అవుదామనుకున్న మేఘ కి 'లై' సినిమా ప్లాప్ తో బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యినట్లే కనబడుతుంది.
'లై 'సినిమా దెబ్బకి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ మేఘకి అవకాశాలు ఇచ్చే ఆలోచన విరమించుకుని... ఆమె ఛాయలకు వెళ్లడం కూడా మానేశారనే టాక్ మొదలైంది. మరి ఒక్క సినిమాతోనే మేఘ కి అవకాశాలు తగ్గిపోయి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందనే గుసగుసలు ఫిలింనగర్ సర్కిల్స్ లో వినబడుతున్నాయి.

