Mon Mar 30 2026 16:12:18 GMT+0530 (India Standard Time)
అభిమాని మృతిని తట్టుకోలేక ఏడ్చేసిన హీరో?

ప్రతీ సినిమా అభిమాని తన అభిమాన హీరోను ఆరాధిస్తాడు. అందుకే ఎక్కడా లేనంత ఫేమ్ సినీ పరిశ్రమలో వస్తుంది. హీరోలు సైతం అభిమానులను ప్రేమతో పలకరించి వారి గురుంచి ఆలోచిస్తారు. వారికి ఏమైనా అయితే హీరోలు కూడా బాధపడిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా.. తమిళ నటుడు కార్తీకి వీరాభిమాని జీవన్ కుమార్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడి వయస్సు కేవలం 27సంవత్సరాలు మాత్రమే.. 3నెలల క్రితమే అతడికి వివాహం అయ్యింది.
తన వీరాభిమాని మృతి చెందాడని తెలిసి కార్తీ షాక్ కు గురయ్యారు. ఈరోజు జరిగిన జీవన్ అంత్యక్రియలకు హాజరయ్యారు. జీవన్ మృతదేహాన్ని చూసి ఏడుపు ఆపుకోలేకపోయిన కార్తీ ఏడ్చేశాడు. తన వీరాభిమానిని ఇలా చూడడం అతడి వల్ల కాలేదు. ఈ ప్రమాదంలో జీవన్ తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Next Story

