అన్నిటికి సిద్ధమంటున్నాడు!!

టాలీవుడ్ లో రాజశేఖర్ హీరోగా సినిమాలొచ్చి చాలా కాలం అయ్యింది. అస్సలు ఈ మధ్యన ఆయనకు కాలం కలిసిరావడం లేదు. హీరోగా కాకపోయినా వేరే అవకాశాలు వచ్చి మరీ చేజారిపోతున్నాయి. అసలు రాజశేఖర్ మీద అనేకరకాల గాసిప్స్ ప్రచారంలో వున్నాయి. అవి గాసిప్స్ కావు నిజాలే అంటారు కొందరు. ఎప్పుడూ షూటింగ్ లకు లేట్ గా వస్తాడని ప్రచారంలో వుంది. ఇక ఇండస్ట్రీలో తన భార్య జీవిత చెప్పిన మాటలనే వేదంగా రాజశేఖర్ పాటిస్తాడని కూడా చెబుతుంటారు.
ఇప్పుడు తాజాగా రాజశేఖర్ గరుడ వేగ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి ముందు రాజశేఖర్, తేజ డైరెక్షన్ లో ఒక మూవీ ని లాంచ్ చేసి దాన్ని పక్కన పడేసాడు. అసలు రాజశేఖర్ గతంలో రాంగోపాల్‌వర్మతో పట్టపగలు చిత్రం చేశాడు. కానీ ఓ టీనేజ్ అమ్మాయికి తండ్రిగా జనాలు అంగీకరించని ఆ సినిమా పూర్తయినా విడుదల చేయలేదు. అయితే ఇప్పుడు రాజశేఖర్ తన మీదొస్తున్న వార్తలకు స్పందించాడు. దర్శకుడు తేజా నాకు ఓ కథ చెప్పిన మాట వాస్తవమే.కానీ నేను షూటింగ్‌కి ఆలస్యంగా రావడం వల్ల తేజా కోప్పడి సినిమా ఆపేశాడు అనేది అబద్దం. చాలా మంచి విలన్ పాత్ర అది, కథ, నా క్యారెక్టర్ నచ్చిన క్లైమాక్స్ విషయంలో తేజాకు, నాకు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో దానిని పక్కనపెట్టేశాం అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ధృవ' చిత్రంలో విలన్‌గా నాకు అవకాశం వచ్చింది. కానీ అంతాఓకే అనుకున్న సమయంలో నిర్మాత ఎన్వీప్రసాద్ తమిళంలో నటించిన అరవింద్‌స్వామినే పెట్టుకుంటున్నాం అని చెప్పడంతో నేను సైడ్ అయ్యాను. ఇక బాలకృష్ణ కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న 102 వ చిత్రం లో నన్ను విలన్‌గా పెడితే బావుంటుందని బాలకృష్ణ డైరెక్టర్ కి, నిర్మాతకి సూచించాడట. అయితే ఆ విలన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఉండదని నాకు తెలియడంతో వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వక ముందే చేయలేనని చెప్పేశా. అయినా నాకు బాలకృష్ణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక వాళ్ళు వచ్చి నాకు కథ చెప్పిన తర్వాత చేయలేనని చెబితే బాగోదని...ముందే బయటపడ్డాను అని చెబుతున్నాడు.
అంతేకాకుండా అప్పుడెప్పుడో చిరంజీవి - విజయ్‌కుమార్‌లు కలసి నటించిన స్నేహం కోసం చిత్రంలో చిరంజీవి స్నేహితునిగా నన్నే అనుకున్నారు. కానీ చిరంజీవి పక్కన నేను వయసులో చిన్నగా కనిపిస్తానని భావించడం వలనే నాకు ఆ ఛాన్స్ చేజారింది.కానీ నాకు మంచి విలన్ పాత్ర వస్తే చెయ్యడానికి రెడీగా వున్నా. అంతేకాదు ఎటువంటి పాత్రలో నటించడానికైనా నేను సిద్ధమంటూ ప్రకటించాడు.

