అనుష్క క్రేజ్ భాగమతి తోనే అర్ధమవుతుంది

అనుష్క నటించిన భాగమతి సినిమా కలెక్షన్స్ విషయంలో దుమ్ముదులుపుతుంది. ఇప్పటికే అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో స్టార్ హీరోతో సమానంగా ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది అనుష్క శెట్టి. అందుకే ఇప్పుడు విడుదలైన భాగమతి సినిమా ఓపెనింగ్స్ విషయంలోనూ అనుష్క మేజిక్ బాగానే పనిచేసింది. ఈ శుక్రవారం విడుదలైన భాగమతి అనుష్క కున్న క్రేజ్ తోనే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. సినిమా టాక్ యావరేజ్ ఉన్నప్పటికీ భాగమతి చిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. అలాగే అనుష్క క్రేజ్ తోపాటు.... భాగమతి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వలన కూడా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది. థమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ కి ఫుల్ మార్కులు పడిపోతున్నాయి. యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు బాగానే కొల్లగొట్టింది. భాగమతి చిత్రం మొదటిరోజు 5.2 కోట్ల షేర్ తో అదరగొట్టింది. అసలు భాగమతి కి మరో సినిమా పోటీ లేకపోవడం, అలాగే సినిమా ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకి మంచి హెల్ప్ చేశాయని చెప్పాలి.
ఏరియాల వారిగా భాగమతి కలెక్షన్స్
నైజాం 2 కోట్ల షేర్
సీడెడ్ లో 70 లక్షలు
ఉత్తరాంధ్ర 60 లక్షలు
గుంటూర్ 50 లక్షలు
గోదావరి జిల్లాలు 70 లక్షలు
కృష్ణా 40 లక్షలు
నెల్లూరు 30 లక్షలు

