అనసూయ అందం కేక

మోహన్ బాబు, మంచు విష్ణు, శ్రియ, అనసూయ కలిసి నటిస్తున్న గాయత్రి సినిమా విడుదలకు సిద్దమవుతున్న సందర్భంలో ఆ సినిమా ఆడియో వేడుకని ఘనంగా నిర్వహించింది చిత్ర బృందం. ఈ వేడుకకి మోహన్ బాబు, మంచు లక్ష్మి, మనోజ్, విష్ణు, అనసూయ, శ్రియ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మ్మనందం, తణికెళ్ల భరణి, మంచు లక్ష్మి కూతురు, మంచు విష్ణు కూతుళ్లు పాల్గొన్నారు. అయితే వీరందరిలోను అందరి దృష్ణి ఆకర్షించింది మాత్రం యాంకర్ అనసూయ. అనసూయ గాయత్రి సినిమాలో ఒక కీ రోల్ అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక ఆడియో వేడుకకి హాజరైన అనసూయ తన గ్లామర్ తో అందరిని కట్టిపడేసింది. గ్లామర్ కి మారుపేరైన శ్రియ శరణ్ ఎంతో పద్దతిగా గాయత్రి ఆడియో వేడుకకి చుడిదార్ లో హాజరవగా అనసూయ మాత్రం అందంతో.. ఫుల్ గ్లామర్ షోతో అదరగోట్టేసింది.
మరి మొదటినుండి హాట్ యాంకర్ గా విరాజిల్లుతున్న అనసూయ ఇప్పుడు సినిమాల్లోనూ తన టాలెంట్ ని చూపిస్తుంది. కానీ సినిమాల్లో అమ్మడుకి ఎప్పుడు ఒకమాదిరి రోల్స్ మాత్రమే పడుతున్నాయి. కానీ గ్లామర్ షో చేసే అవకాశం మాత్రం ఎన్నడూ రాలేదు. అనసూయ ఈ గాయత్రి సినిమాతో పాటే.... రామ్ చరణ్ రంగస్థలంలోనూ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. మరి ఎప్పుడూ హాట్ హాట్ గా వుండే అనసూయ ఇలా ఒక ఆడియో వేడుకకి కూడా గ్లామర్ తో కూడిన డ్రెస్ తో హాజరై తాను దేనికి తగ్గేదిలేదని నిరూపించింది.
మరి అనసూయ అనుకున్నట్టుగా గాయత్రి, రంగస్థలం సినిమాలు ఆమెకి ఎంతగా పేరు తెచ్చిపెడతాయి అనేది కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది