అధికారిక ప్రకటన వెలువడే వరకు నమ్మడం కష్టం

దర్శకుడు శంకర్ ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా తెరకెక్కిస్తున్న 2.0 షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటె శంకర్ తన నెక్స్ట్ సినిమాని కమల్ హసన్ తో చేయబోతున్నాడు అనే టాక్ కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఇంతకుముందే వీరి కలయికలో లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా అటు తమిళంలో ఇటు తెలుగులో సంచలన విజయం సాదించింది.
అయితే ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని నిర్మాత ఎ.ఎం రత్నం ఎప్పటి నుంచో కోరుకుంటున్నారట. కానీ దీని గురించి కమల్ హాసన్ కానీ, శంకర్ కాని ఇంతవరకు స్పందించలేదు. అయితే కోలీవుడ్ వర్గాల నుంచి ఇప్పుడు తాజాగా అందుతున్న సమచారం ప్రకారం త్వరలోనే వీరిద్దరి కలయికలో భారతీయుడు సీక్వెల్ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయం పై దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ఇక కమల్ హసాన్ భారతీయుడు 2 ని మొదలుపెడితే ఆశ్చర్యం లేదని అంటున్నాయి చెన్నై వర్గాలు.
దర్శకుడు శంకర్ ఇప్పటికే ఈ సీక్వెల్ కోసం ఓ లైన్ కూడా అనుకున్నారు అని...... కమల్ హాసన్ కూడా ఆ లైన్ విని పాజిటివ్ గా స్పందింస్తే ఈ సినిమా తప్పకుండా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న 2.0 జనవరి 25 న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
అయితే మరోపక్క వీరి కలయికలో భారతీయుడు సీక్వెల్ అనేది ఉండకపోవచ్చంటున్నారు . ఎందుకంటే లోకనాయకుడు కమల్ హసన్ త్వరలోనే అంటే ఈ దసరాకే ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లుగా తమిళనాడు వర్గాల భోగట్టా. మరి కమల్ రాజకీయాలతో బిజీగా ఉంటే శంకర్ - కమల్ ప్రాజెక్ట్ ముందుకెలా వెళుతుందని అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ భారతీయుడు 2 తెరకెక్కుతోందని.... అధికారిక ప్రకటన వచ్చేవరకు నమ్మలేం అంటున్నారు.