అదేమిటి చెప్మా..?

అల్లు అర్జున్ డీజే చిత్రం విడుదలయిన కొన్ని రోజులకే కొత్త దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వక్కంతం వంశీ డైరెక్షన్ లో నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా చిత్రానికి పూజ కార్యక్రమాలు జరిపించేసాడు. సినిమా మొదలైన కొద్దీ రోజులకే అంటే నిన్న ఆగష్టు 2 న అల్లు అర్జున్ కూడా నా పేరు సూర్య సెట్స్ లో జాయిన్ అవడము.... సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టుకోవడము జరిగిపోయాయి. మరి సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడే ఈ సినిమా విడుదల డేట్ ని కూడా అనౌన్స్ చేసేసాడు అల్లు అర్జున్. వచ్చే ఏడాది 2018 ఏప్రిల్ 27న నా పేరు సూర్య సినిమా విడుదల చేస్తున్నట్లు చెప్పేసాడు.
మరి విడుదల డేట్ అనౌన్స్ చేసాక చిత్ర షూటింగ్ ని కూడా అదే లెవల్లో పరిగెత్తించాలనే ప్లాన్ లో అల్లు అర్జున్ తోపాటు చిత్ర టీమ్ కూడా వుంది.అందుకే సినిమా షూటింగ్ ఇలా మొదలయ్యిందో లేదో అలా సినిమాకి సంబందించిన ఒక కొత్త విషయాన్ని చెబుతానంటూ ఫాన్స్ ని ఊరించేస్తున్నాడు అల్లు అర్జున్. అయితే నా పేరు సూర్య... కి సంబందించిన ఆ సర్ప్రైజ్ ని మాత్రం ఆగస్టు 15న ఇస్తానంటున్నాడు. మరి మిలటరీ ఆఫీసర్ గా నటిస్తున్న అల్లు అర్జున్ ఈ చిత్రం కోసం అమెరికా నుండి వచ్చిన ట్రైనర్ ఆధ్వర్యంలో ఒకనెలరోజుల పాటు కఠిన శిక్షణ తీసుకోబోతున్నాడు.
నాపేరు సూర్యకి విశాల్-శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి నాపేరు సూర్యకి సంబందించిన ఆ సర్ప్రైజ్ ఏమిటో అని ఫాన్స్ తెగ ఆత్రుత పడిపోతున్నారు. ఒకవేళ సినిమా ఫస్ట్ లుక్ గాని విడుదల చేస్తున్నారనే డౌట్ లో వారు ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఆ సర్ప్రైజ్ తెలియాలంటే మనం కూడా ఆగష్టు 15 వరకు ఆగాల్సిందే.

