అదిరిపోయే రేటొచ్చింది

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ రెండు సినిమాలతో బిజీగా వున్నాడు. జై లవ కుశ సినిమా నిర్మాతగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోగా రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు ఉపేంద్ర దర్శకత్వంలో ఎమ్యెల్యే సినిమా చేస్తున్న కళ్యాణ్ రామ్... ఈ సినిమాలో కాజల్ తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇకపోతే కళ్యాణ్ రామ్ - తమన్నా జంటగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా కూడా తెరకెక్కుతున్నది.
ఈ సినిమా అప్పుడే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది కూడా. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎనలేని క్రేజ్, అంచనాలు వచ్చేసాయి. ఈ సినిమాకి జయేంద్ర, పిసి శ్రీరామ్ వంటి వాళ్ళు టెక్నీషియన్స్ గా పనిచెయ్యడం కూడా ఈ సినిమా అంచనాలు పెరగడానికి కారణమయ్యాయి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సాఫ్ట్ లుక్ లో నీట్ గా కనబడతాడనే టాక్ వుంది. ఇకపోతే కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో జాక్ పాట్ కొట్టాడంటున్నారు. కళ్యాణ్ రామ్ సినిమాశాటిలైట్స్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయట.
జెమిని సంస్థ ఈ సినిమా శాటిలైట్ హక్కులును దాదాపు 4.75 కోట్లకు తీసుకున్నట్లుగా సమాచారం. మరి కళ్యాణ్ రామ్ సినిమాకి శాటిలైట్స్ హక్కుల ద్వారా ఇంత పెద్ద మొత్తం రావడమంటే మాటలు కాదు. మరి హీరోయిన్ తమన్నా తో టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చెయ్యడం వల్లనె ఈ రేటు వచ్చిందంటున్నారు . ఎంతైనా ఆ క్రెడిట్ కాస్త కళ్యాణ్ రామ్ కే వెళుతుంది అది వేరే విషయం.

