అడ్డంగా దొరికేసాడు

పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. ఈ చిత్రం విడుదలకు ముందు ఈ చిత్రం ‘లార్గో విచ్’ అనే ఫ్రెంచ్ చిత్రం కాపీ అనే వార్తలొచ్చాయి. కానీ అది నిజంగా కాపీయా.. కాదా అనే విషయం తెలియలేదు. కానీ ఇప్పుడు ఆ చిత్రం కాపీ అనే విషయం తెలిసిపోయింది. స్వయంగా ఆ ఫ్రెంచ్ చిత్ర దర్శకుడే ఈ చిత్రం తన చిత్రంతో పోలి ఉందని ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
2008లో జెరోమ్ సాలీ అనే దర్శకుడు ‘లార్గో విచ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రంలో కథాంశంతోనే ‘అజ్ఞాతవాసి’ తెరకెక్కుతోందని వార్తలొచ్చాయి. దాంతో చాలామంది ఆ చిత్రాన్ని చూసేశారు. ఇప్పుడు తాజాగా విడుదలైన అజ్ఞాతవాసి కూడా అదే కథాంశంతో ఉండడంతో ఈ చిత్రం కాపీ చిత్రం అని తేల్చేశారు ప్రేక్షకులు. మరి త్రివిక్రమ్ మనసుకు నచ్చింది... ఎన్నో భావజాలాలున్న కథ, సెంటిమెంట్ పండుతుందని చెప్పిన మాటలన్నీ ఇప్పుడు తప్పనితేలిపోయి అడ్డంగా బుక్ అయ్యాడు.
కథ పాతదే అయినా.. కథనంతో చిత్రాన్ని గట్టెక్కించాలని అనుకున్న త్రివిక్రమ్ కు ఈ చిత్ర ఫలితం గట్టి ఎదురుదెబ్బ లాంటిదే అని చెప్పొచ్చు. పైగా ఇప్పుడు ఈ చిత్రం కాపీ అనే విషయాన్ని స్వయంగా ఆ ఫ్రెంచ్ చిత్ర దర్శకుడే చెప్పడంతో ఇప్పుడు ఈ వార్త కలెక్షన్ల పై ప్రభావం చూపుతుందేమో చూడాలి. ‘లార్గో విచ్’ డైరెక్టర్ జెరోమ్ సాలీ, ఫ్యాన్స్ మధ్య ఈ చిత్రాన్ని చూడటం చాలా సంతోషంగా అనిపించింది. మూవీ నాకు బాగా నచ్చింది. అయితే నా చిత్రానికి, 'అఙ్ఞాతవాసి'కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ట్వీట్ చేసాడు.

