Tue Mar 24 2026 02:57:42 GMT+0530 (India Standard Time)
అచ్చం మన నానిలాగే వరుణ్ కూడా

టాలీవుడ్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి వరస సినిమాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు హీరో నాని. కెరీర్ ని బాగా ప్లాన్ చేసుకుని ఏడాదికి మూడు సినిమాలు వుండేటట్టు చూసుకుంటున్నాడు నాని. ఇలానే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా.
గత మూడేళ్లు నుండి చూసుకుంటే... ప్రతి ఏడాది మూడు సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ బాలీవుడ్ హీరో. మిగతా హీరోలు ఏడాదికి ఒక సినిమా చేస్తుంటే.. వరుణ్ మాత్రం పక్క ప్లానింగ్ తో సినిమాల సంఖ్య పెంచుకుంటున్నాడు..
2015లో మూడు సినిమాలు 2017లో రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇక 2018లో మూడు సినిమాలు సిద్దమవుతున్నాయి. ఇంత పక్క ప్లానింగ్ తో వెళ్తున్నాడు కనుకనే అతనికి సినిమాలు కూడా వరుస కడుతున్నాయి. అనుష్క శర్మతో కలిసి ప్రస్తుతం సూయి ధాగా సినిమాలో నటిస్తున్నాడు.
Next Story

