అఖిల్ పై కంప్లెయింట్ ఇచ్చిన డైరెక్టర్

నాగార్జున రెండో కొడుకు అఖిల్ 'అఖిల్' అనే సినిమాతో సినిమా పరిశ్రమలోకి అరంగేట్రం చేసాడు. వి.వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. అఖిల్ తన పెర్ఫార్మన్స్ పరంగా కూడా జనాలని ఆకట్టుకోలేకపోయాడు. అయితే 'అఖిల్' సినిమాలో అఖిల్ ప్రతి దాంట్లో వేలు పెట్టాడని అందుకే సినిమా డిసాస్టర్ అయ్యిందనే టాక్ ఉంది.
అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని 'మనం' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో 'హలో' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా అఖిల్ అన్నింట్లో వేలు పెడుతున్నాడని..అఖిల్ జోక్యం ఎక్కువ అవుతున్నందుకు దర్శకుడు విక్రమ్ కె కుమార్ చిరాకు పడుతున్నాడట. అఖిల్ గురించి నాగార్జునకి కూడా కంప్లెయింట్ కూడా చేసాడంట విక్రమ్. అయితే నాగార్జున కూడా అఖిల్ పై సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది. అన్ని విషయాల్లో వేలు పెడితే ఈ సారి కూడా సినిమా ఫ్లాప్ అవుతుందని అఖిల్ కి వార్నింగ్ ఇచ్చాడట నాగార్జున.
రెండో సినిమాకే అఖిల్ ఇలా అన్నింటిలో వేలుపెడితే ముందు ముందు కష్టమేమో అని అంటున్నారు ఫిలిం నగర్ జనాలు. అఖిల్ జర చూసుకో బాబు.

