Wed Dec 10 2025 12:23:57 GMT+0000 (Coordinated Universal Time)
అఖిల్ ఎంగేజ్మెంట్ అయిపోందహో!!

అంగరంగ వైభవంగా అక్కినేని వారసుడు అఖిల్ ఎంగేజ్మెంట్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని జివికె హౌస్ లో జరిగింది. కొద్దిమంది అతిధులు మాత్రమే హాజరైన ఈ వేడుకకి మీడియా కి నో ఎంట్రీ అని ముందే నాగార్జున పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ చెప్పాడు. ఇక కొద్దిమంది అతిరథమహారధుల మధ్యన అఖిల్ తాను ప్రేమించిన శ్రీయ భూపాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీ నుండి కూడా చాల తక్కువ సంఖ్యలో ఈ వేడుకకి హాజరైనట్టు తెలుస్తుంది. ఈ ఎంగేజ్మెంట్ లో నాగార్జున భార్య అమల సమేతంగా తన కొడుకు కోడలితో దిగిన ఫోటో ఒకటి ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మీరు ఆ ఫోటోని వీక్షించండి.
Next Story

