అందుకే బాలయ్య కి హ్యాండ్ ఇచ్చాడా?

ఆ మధ్యన అమితాబచ్చన్ బాలకృష్ణ 'రైతు' సినిమాలో నటించటానికి ఇంట్రెస్ట్ చూపలేదని... అందుకే ఆ ప్రాజెక్ట్ ని బాలకృష్ణ - కృష్ణవంశీ లు పక్కన పడేశారని న్యూస్ తెగ ప్రచారం అయ్యింది. అయితే అప్పుడు అమితాబ్ బాలకృష్ణ కి 'రైతు' సినిమాలో 'నో' చెప్పిన ఆయన.... ఇప్పుడు చిరు 'సై రా నరసింహారెడ్డి' కి 'ఎస్' అని చెప్పడం ఏమిటా అని మెగా ఫాన్స్, నందమూరి ఫాన్స్ మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు డీప్ సెర్చింగ్ లో ఉన్నారు. అలాగే అమితాబ్ బాలయ్యని అవమానించాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అమితాబ్, బాలకృష్ణ - కృష్ణవంశీల కాంబినేషన్లో తెరకెక్కనున్న 'రైతు' కి 'నో' చెప్పడానికి... చిరంజీవి 'సై.. రా' కి 'ఎస్' చెప్పడానికి పెద్ద కారణమే ఉందని అంటున్నారు.
గత ఏడాది గౌతమీపుత్ర షూటింగ్ లో ఉన్నప్పుడే బాలకృష్ణ, కృష్ణ వంశీ లు ఇద్దరూ కలిసి సాక్షి రామ్ రెడ్డి రాసిన 'రైతు' కథతో మెగాస్టార్ అమితాబచ్చన్ ని... 'రైతు' సినిమాలోని రాష్ట్రపతి కేరెక్టర్ కోసం ఒక నిమిషంన్నర పాత్ర చెయ్యమని అడగడానికి ముంబై వెళ్లగా... 'రైతు' కథ విన్న అమితాబచ్చన్ ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుని... ఎన్టీఆర్ లాంటి మహానుభావుడిని ఇలా ఏదన్న సినిమాలో ఒక నిమిషంన్నర పాత్ర చెయ్యమంటే ఎలా ఉంటుంది అనే అర్ధం వచ్చేలా మట్లాడినట్టుగా టాక్. అయితే అమితాబ్ తమ 'రైతు' చిత్రంలో నటిస్తే ఎలాగైనా తమ సినిమాకి క్రేజ్ వస్తుందని భావించిన బాలయ్య అండ్ కృష్ణవంశీ లు అమితాబ్ చేసే రాష్ట్రపతి కేరెక్టర్ నిడివి పెంచి ఆ పాత్ర చెయ్యమన్నా... దానికి అమితాబ్, ఈ కేరెక్టర్ నిడివి పెంచినా బాగుండదని.... చెప్పి వారిని పంపించేసాడట.
మరి 'రైతు'లో నిమిషంన్నర పాత్ర చెయ్యడానికి అమితాబ్ 'నో' చెప్పిన విషయం తెలుసుకున్న చిరు అండ్ కో తమ 'సై రా' సినిమాలో అమితాబ్ 'నో' అని చెప్పడానికి స్కోప్ లేకుండా తమ సినిమాలో అమితాబ్ పాత్రని తీర్చి దిద్దారట. ఇక 'సై రా నరసింహారెడ్డి' లో అమితాబ్ పాత్ర నిడివి ఎక్కువగా చేసి అమితాబ్ కి వినిపించగా దానికి అమితాబ్ 'ఎస్' చెప్పాడనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. అదన్నమాట బాలయ్యకి 'నో' చెప్పడం, చిరుకి 'ఎస్' చెప్పడానికి వెనుక ఉన్న అమితాబ్ కారణం. అయితే ఈ విషయంలో నిజంగా నిజమెంతుందో తెలియదు గాని ఇప్పుడా న్యూస్ టాప్ ట్రేండింగ్ లో ఉంది.

