అందుకే నయన్ ను సూపర్ స్టార్ అంటారు

సైరా నరసింహా రెడ్డి చిత్రం అనౌన్స్ చేసిన దగ్గర నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి 151వ చిత్రం కావడంతో సినిమాపై మరింత అంచనాలు ఎక్కువ అయ్యాయి. అదేవిధంగా సినిమాపై గాసిప్పులు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. అసలు ఇంతకీ ఈ సినిమాలో నయనతార నటిస్తుందా లేదా అనేది ఇంకా అందరిలోనూ మదిలో మెదిలే ప్రశ్న.
అయితే కచ్చితంగా ఈ సినిమాలో నయన్ నటిస్తుందట. నిన్నటివరకు వచ్చిన గాసిప్పులు అన్ని వట్టిదే అని తెలిసిపోయింది. ఆ పాత్రకోసం దాదాపు రూ.3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందట నయన్. ఆమె అడిగినంత ఇవ్వటానికి నిర్మాత రామ్ చరణ్ ఒప్పుకున్నారట. ఆమె తీసుకునే రెమ్యునరేషనే సౌత్ లోనే ఏ హీరోయిన్ డిమాండ్ చేయడం లేదు. సినిమా హిట్ - ఫ్లాపులతో సంబంధం లేకుండా సాగిపోతోంది నయన్ కెరీర్. అందుకే నయన్ ను మాత్రమే సూపర్ స్టార్ అని పిలవడం ప్రారంభించారు. కుర్రహీరో నుండి పెద్ద హీరో దాకా అందరితో నటించేస్తోంది. అలానే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ సత్తా చూపిస్తోంది.
మొన్నటివరకు నయన్ కోసమే సినిమా షూటింగ్ లేట్ అవుతుందని అన్నారు. మరి ఇప్పుడు నయన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా షూటింగ్ కి వెళ్ళటమే ఆలస్యం. ఈ చిత్ర మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదల చేయగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

