అందాల ఆరబోత ఒక కళ అంటున్న ముద్దుగుమ్మ

కథానాయికలు సహజంగా ఎక్స్పోసింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే కథ అవసరం అని కోరితే తప్ప చెయ్యమనో, అందాలు చూపించటానికి సమయం సందర్భం ఉండాలనో చెప్తుంటారు. కానీ రష్మీ గౌతమ్ ఈ విషయంలో అంతా ఓపెన్. తాను ఈ మధ్య కాలంలో నటించిన గుంటూరు టాకీస్, అంతం, చారు శీల చిత్రాలలో కూడా ఈ అమ్మడుకి అందాలు విరజిమ్మే పాత్రలే ఇచ్చారు ఆయా చిత్రాల దర్శకులు. అయితే ఈ భామ వెండి తెర, బుల్లి తెర అనే వ్యత్యాసాలు ఏమి చూపక తాను బుల్లి తెర పై కనిపించే కార్యక్రమాలలో కూడా కురచ దుస్తులతో కనిపిస్తూ కుర్రకారులను అలరిస్తుంది.
ఈ మితిమీరిన ఎక్స్పోసింగ్ గురించి రష్మీ గౌతమ్ దగ్గర ప్రస్తావించగా, "పాత్రకు తగ్గ విధంగా అందాలు ఆరబోత అనేది ఒక కళ. కళాకారిణి గా నేను ఆ పనిని సక్రమంగా నెరవేరుస్తున్నాని మీ ప్రశ్నతో నాకు నమ్మకం వచ్చింది. అందాల ఆరబోత అంటే కేవలం రహస్య శరీర భాగాలు కనిపించే తీరున దుస్తులు ధరించటం అనుకుంటే పొరపాటే. వివిధ చిత్రాలలో అందాలు చూపించిన కథానాయికలకు మళ్లీ అటువంటి అవకాశాలు వస్తున్నాయి అంటే ఒక చిత్రానికి మరో చిత్రానికి అందం ప్రదర్శించే తీరులోనూ వ్యత్యాసం ఉంటుంది అనే కదా. చీర కట్టులో ఉండే కథానాయిక కూడా ఆ పని చేస్తుంది, అలానే 2 పీస్ బికినీ వేసుకునే కథానాయిక కూడా ఆ పని చేస్తుంది. ప్రేక్షకుడు చూసే తీరుని బట్టి అందాన్ని ఆస్వాదించే గుణం పాత్రా నుంచి పాత్రకు మారుతుంటుంది." అని హిత బోధ చేస్తుంది రష్మీ గౌతమ్.
అంతే కాకుండా తాను ఐటెం సాంగ్స్ లో నృత్యం చెయ్యటానికి కూడా ఎల్లప్పుడూ సిద్ధమేనని ప్రకటించేసింది రష్మీ. చూద్దాం ఏ దర్శకుడు అటువంటి అవకాశాన్ని రష్మీకి కల్పిస్తారో..

