అందరికి పూర్తి క్లారిటీ ఇచ్చేసింది

మొన్నామధ్యన అంటే రాజుగారి గది2 లో హీరోయిన్ గా సెట్ అవ్వకముందు రన్ రాజా రన్ ఫెమ్ సీరత కపూర్ రకరకాల ఫోటో షూట్స్ తో జనాల మతులు పోగొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఫోటో షూట్స్ లో బికినీ వేసుకుని మరీ ఫొటోస్ తీయించుకుని సోషల్ మీడియాలో షేర్ చేసి సంచలనం అయ్యింది. హీరోయిన్ గా క్రేజ్ రాని ఈ భామకు ఈ ఫోటో షూట్స్ తో బోలెడంత క్రేజ్ వచ్చేసి వరుసగా సినిమా అవకాశాలు కొట్టేసింది. దెబ్బకి ఫోటో షూట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టి సినిమాల్లో బిజీ అయ్యింది. అయితే సినిమాల్లోకూడా అందాల ఆరబోతకు అడ్డుకట్ట వెయ్యలేదు అమ్మడు.
సీరత్ కపూర్ తాజాగా నటించిన రాజుగారి గది2 సినిమా రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో సీరత్ కపూర్ బికినీ షో ఉన్నట్టుగా దాన్ని సెన్సార్ వారు కట్ చేసినట్లుగా వార్తలొచ్చాయి. సీరత్ బికినీ కి కట్ వేసిన సెన్సార్ అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే రాజుగారి గదిలో నాగార్జున, సమంత లు కూడా కీ రోల్స్ చేస్తుండడంతో వారి క్రేజ్ ని ఉపయోగించుకోవాలనుకున్న దర్శకుడు ఓం కార్ పబ్లిసిటీలో భాగంగా నాగార్జున, సమంత పోస్టర్స్ వదులుతున్నాడు గాని హీరోహీరోయిన్స్ అయినా అశ్విన్, సీరత్ కపూర్ ల ఫొటోస్ గాని పోస్టర్స్ గాని వదలకుండా వదిలేసాడు.
అయితే రేపు సినిమా విడుదలవుతుండగా ఈ రోజు గురువారం రాజుగారిగదిలో తన పోస్టర్ ని తానే విడుదల చేసుకుంది సీరత్. సీరత్ కపూర్ రాజుగారి గది విడుదలకు ఒక రోజు ముందు ఫస్ట్ లుక్ అంటూ.. బికినీ వేర్ లో ఉన్న తన పోస్టర్ ను విడుదల చెయ్యడం వెనుక సెన్సార్ వారు సీరత్ బికినీ షోకి కత్తెర వేశారనే ప్రచారానికి చెక్ పెట్టేందుకే ఇలా చేసిందేమో అంటున్నారు. మరి ఈ సినిమాలో సీరత్ తన అందాల ప్రదర్శన ఎలా వుండబోతుందో ఇలా బికినీ పోస్టర్ తో క్లూ ఇచ్చేసిందన్నమాట.

