అందరికి థాంక్స్ చెప్పేస్తుందీ.. భామ!!

వరుణ్ తేజ్ - సాయి పల్లవి జోడిగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఫిదా చిత్రం పాజిటివ్ టాక్ తోనే కాదు సూపర్ రివ్యూస్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఫిదా చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి నటనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతూ ఫిదా అవుతున్నారు. పక్కా పల్లెటూరి తెలంగాణ అమ్మాయిగా సాయి పల్లవి చేసిన అల్లరికి, ఆమె నటనకి అందరూ ఫిదా అవుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే తాను తెలుగులో నటించిన తోలి సినిమాకే ఇంత ప్రేమ కురిపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు సాయి పల్లవి థాంక్స్ చేప్పేస్తుంది.
సోషల్ మీడియా, ఫోన్స్ ద్వారా ఎంతోమంది అభిమానులు తనపై కురిపిస్తున్న ప్రేమకు సదా రుణపడి ఉంటానని సాయిపల్లవి చెబుతుంది. ఫిదా సినిమా హిట్ తో తాను ఎంత సంతోషంగా ఉన్నాననే విషయాన్ని వర్ణించడానికి మాటల్లేవని చెప్పుకొచ్చింది. ఇక ఫిదాలో భానుమతి పాత్రకు తాను కొంచెం న్యాయం చేసినట్లు మాత్రమే ఆశిస్తున్నానని సాయిపల్లవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే శేఖర్ కమ్ముల వంటి డైరెక్టర్ తో పనిచెయ్యడం తన అదృష్టమని.... ఆయనకు ఓపిక ఎక్కువని చెప్పుకొచ్చింది.
అలాగే దిల్ రాజు వంటి నిర్మాత దొరకడం కూడా తనకు లక్కీ అని... తాను ఫిదా లో భానుమతి పాత్రను అంతలా పండించడానికి కారణం వరుణ్ తేజ్ సపోర్ట్ అని... వరుణ్ ని కూడా ఆకాశానికెత్తేసింది సాయి పల్లవి.

