అందరికి ఆదర్శంగా నిలిచేలా వున్నారు

సమంత పెళ్లి తర్వాత కూడా నటిస్తానని చెప్పడం... అలాగే పెళ్లి తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వనని ప్రకటించడమే కాదు...... చెప్పినట్టుగానే చిన్న గ్యాప్ (కేవలం 6 రోజులు మాత్రమే) తర్వాత సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. గత రెండు రోజులుగా రాజుగారి గది 2 ప్రమోషన్స్ కోసం కష్టపడుతున్న ఈ భామ రేపట్నుంచి మళ్లీ సినిమాలతో బిజీ అయిపోనుంది. ఇప్పటికే రాజుగారి గది 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఈ సినిమా తో అమృతగా హిట్ కొట్టేసింది. రాజుగారి గది ఈ శుక్రవారమే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది ఈ అక్కినేని కోడలు పిల్ల. అయితే రేపట్నుంచి అంటే రేపు శనివారం నుండి సమంత మహానటి షూటింగ్ లోకి దిగిపోతుంది.
ఇప్పటికే మహానటి కోసం ఇచ్చిన కాల్షీట్ల ప్రకారం.. మహానటి సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే.. రంగస్థలం సినిమాలో బ్యాలెన్స్ ఉన్న కొన్ని సీన్స్ కోసం రంగస్థలం సెట్స్ పైకి షిఫ్ట్ అవుతుంది సమంత. మరి సినిమాలకిచ్చిన కమిట్మెంట్స్ తో పెళ్ళైనా హానిమూన్ కి వెళ్లకుండా సమంత, నాగ చైతన్య ల జంట ఎందరికో ఆదర్శంలా నిలిచేలా కనబడుతున్నారు. ఇక నాగ చైతన్య కూడా పెళ్లి తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి ని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే ఈ సినిమా ముహూర్తానికి ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. ఇకపోతే సవ్యసాచి తర్వాత చైతు మారుతీ దర్శకత్వంలో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటించనున్నాడు.

