Fri Jan 30 2026 23:55:14 GMT+0000 (Coordinated Universal Time)
ఆ వీడియోను తొలగించిన యూట్యూబ్
ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో యూట్యూబర్ రణ్వీర్

ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో యూట్యూబర్ రణ్వీర్ ఇలహాబాదియాకు చెందిన వివాదాస్పద వీడియోను యూట్యూబ్ తొలగించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి యూట్యూబ్‌కు నోటీసులు రావడంతో అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన వీడియోను యూట్యూబ్ తొలగించింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.
తన వ్యాఖ్యలపై రణ్ వీర్ క్షమాపణలు కోరాడు. ఆ షోలో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నన్ను క్షమించండి. నా వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి.. నేను చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకోవడం లేదు. అన్ని వయస్సుల వారు నా పాడ్ కాస్ట్‌ను చూస్తారు.. అలాంటప్పుడు బాధ్యతగా ఉండాలి.. కానీ నేను ఆ వ్యాఖ్యలు చేసి చాలా తప్పు చేశానని రణ్ వీర్ తెలిపాడు. తన అనుచిత వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా వీడియో మేకర్స్‌ను కోరానని, జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నానని, క్షమిస్తారని ఆశిస్తున్నానని వీడియో విడుదల చేశాడు రణ్ వీర్.
Next Story

