Fri Dec 05 2025 13:16:30 GMT+0000 (Coordinated Universal Time)
యోగేష్‌కు బహుమతిగా లభించిన బైక్‌పై ప్రపంచ యాత్ర ఆరంభం
బైక్ పై ప్రపంచ యాత్రకు బయలుదేరిన ముంబై యువకుడు యోగేశ్ అలెకరికి యూకేలోని నాటింగ్ హామ్ లో చేదు అనుభవం ఎదురైంది.

బైక్ పై ప్రపంచ యాత్రకు బయలుదేరిన ముంబై యువకుడు యోగేశ్ అలెకరికి యూకేలోని నాటింగ్ హామ్ లో చేదు అనుభవం ఎదురైంది. ఓ పార్క్ లో పెట్టిన బైక్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. స్థానికంగా ఉంటున్న ఓ స్నేహితుడిని కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసి తిరిగొచ్చే సరికి బైక్ మాయమైందని యోగేశ్ వాపోయాడు. పాస్ పోర్ట్, వీసా వంటి కీలక డాక్యుమెంట్లతో పాటు డబ్బు కూడా అందులోనే ఉండిపోయిందని చెప్పడంతో ఎంతో మంది యోగేష్ కు సాయం చేయడానికి ముందుకొచ్చారు. యోగేష్ కథ అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచిన తర్వాత అతనికి మోటార్ సైకిల్‌ను అందజేసేందుకు ఆఫ్ రోడ్ బైక్ సెంటర్ ముందుకొచ్చింది. యోగేష్ మరో బైక్ తీసుకున్న తర్వాత ఆ బైక్ ను నాటింగ్‌హామ్‌లోని న్యూ బాస్ఫోర్డ్లోని భగవతి శక్తి పీఠ ఆలయానికి, ఆపై కార్ల్టన్ రోడ్‌లోని మరో ఆలయానికి తీసుకుని వెళ్ళాడు.
Next Story

