Fri Dec 05 2025 08:56:48 GMT+0000 (Coordinated Universal Time)
సెల్ ఫోన్ బుక్ చేస్తే సబ్బులొచ్చాయ్
ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఒక వస్తువుకు బదులుగా మరో వస్తువు వస్తూ ఉంటుంది.

ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఒక వస్తువుకు బదులుగా మరో వస్తువు వస్తూ ఉంటుంది. అలా ఓ వ్యక్తి ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్ బుక్ చేయగా సబ్బులు డెలివరీ అయ్యాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన బానోత్ రాజేందర్ ఆన్లైన్లో మోటొరోలా జీ85 5జీ మొబైల్ ఫోన్ బుక్ చేశాడు. మంగళవారం డెలివరీ డేట్ చెప్పారు.
అయినా రెండు రోజులు ఆలస్యంగా వచ్చింది. రాజేందర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన తండ్రి నర్సింహ డెలివరీ బాయ్ కి 16 వేల 68 రూపాయలు చెల్లించి పార్శిల్ తీసుకున్నారు. పార్శిల్ తెరిచి చూస్తే త్రిబుల్ ఎక్స్ సబ్బులు ఉన్నాయి. మోసం జరిగిందని డెలివరీ బాయ్ కి చెప్పగా ఐటమ్ రిటర్న్ చేయమని సూచించాడు.
Next Story

