Sat Oct 12 2024 06:38:48 GMT+0000 (Coordinated Universal Time)
2గంటల పాటు వాట్సాప్ ఎందుకు పనిచేయలేదో తెలుసా ?
అక్టోబర్ 25, భారతదేశంతో పాటూ ఇతర దేశాలలో కూడా WhatsApp పనిచేయలేదు. దాదాపు రెండు గంటల పాటు మిలియన్ల మంది వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.ఈ అంతరాయం కారణంగా, వినియోగదారులు సందేశాలను పంపలేకపోయారు.. WhatsApp ఆడియో, వీడియో కాల్ వంటి సేవలను ఉపయోగించలేకపోయారు. వాట్సాప్ ఓనర్అయిన Meta కంపెనీ తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు సేవలు నిలిచిపోయాయో వివరణ ఇచ్చింది.
మెటా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ సాంకేతిక లోపం కారణంగా వాట్సాప్ కొద్దిసేపు ఆగిపోయిందని తెలిపారు. ఆ సాంకేతిక లోపానికి కారణం ఏమిటనే విషయాన్ని మాత్రం మెటా వెల్లడించలేదు. ఆరేళ్ల కిందట అక్టోబర్ లో వాట్సప్ కొద్దిసేపు ఆగిపోయింది. ఆ సమయంలో డీఎన్ఎస్ (డొమైన్ నేమ్ సిస్టమ్) సంబంధిత సమస్య కారణంగా తమ సేవలు నిలిచిపోయాయని కంపెనీ తెలిపింది.
అక్టోబరు 25న మధ్యాహ్నం 12:30 భారత కాలమానం ప్రకారం అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం 2:30 గంటలకు సేవలు పునరుద్ధరించబడ్డాయి. ఆ సుమారు రెండు గంటల్లో, WhatsApp వినియోగదారులు సందేశాలు, మీడియా ఫైల్లను పంపలేకపోయారు. వినియోగదారులు ఫోన్ కాల్లు, వీడియో కాల్లు కూడా చేయలేకపోయారు. 69 శాతం మంది వినియోగదారులు సందేశాలను పంపడంలో సమస్యలను ఎదుర్కొన్నారని, 21 శాతం మంది వినియోగదారులు సర్వర్ కనెక్షన్ సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నారని అవుట్టేజ్ ట్రాకర్, డౌన్డెటెక్టర్ చూపించింది. ఇతర కారణాల వల్ల దాదాపు 9 శాతం మంది వినియోగదారులు యాప్ను ఉపయోగించలేకపోయారు.
Next Story